చంద్రబాబు బాటలో అభివృద్ధి ఎజెండగా పనిచేయాలి: గద్దె అనూరాధ

విజయవాడ,మే4( జ‌నంసాక్షి): అభివృద్ది ఎజెండగా పనిచేస్తూ ముందుకు సాగుతున్నామని  కృష్ణా జిల్లా జెడ్పీ చైర్మన్‌గా ఎన్నికైన గద్దె అనురాధ అన్నారు. మఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దూరదృష్టితో చేస్తున్న అభివృద్దిన చూసి వైకాపా తట్టుకోవడం లేదని అన్నారు. ప్రజలు చంద్రబాబుపై  ఉంచిన నమ్మకాన్ని వమ్ముచేయరని, ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారని గద్దె అనురాధ అన్నారు. త్రాగునీరు, రోడ్లు, డ్రైనేజీ సమస్యలకు ప్రాధాన్యత ఇస్తూ జిల్లాలో సమస్యల పరిష్కారనికి కృషి చేస్తున్నామని

అన్నారు. టీడీపీ క్రమశిక్షణ గల పార్టీ అని గద్దె అనురాధ స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరూ అధినేత ఆదేశాల మేరకు పనిచేస్తున్నారని అన్నారు.  భవిష్యత్తు తరాల ప్రజల కోసం రాజకీయాలకు అతీతంగా అందరం కలసికట్టుగా శ్రమిద్దామని, ప్రతి ఇంట్లో ఇంకుడు గుంత తవ్వి వర్షపు నీటిని ఇంకింపజేసేందుకు ప్రజలు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. దీనికి రాష్ట్ర స్థాయిలో గుర్తింపు లభించే విధంగా అధికార యంత్రాంగం, ప్రజాప్రతినిధులు ప్రజలను చైతన్య పరచాలని సూచించారు. నీరు-చెట్టు కార్యక్రమం ద్వారా ప్రభుత్వ చేపట్టిన చెరువుల్లో పూడికతీత, పంట సంజీవని ద్వారా పొలంలో సేద్యపు కుంటల తవ్వకంతో వచ్చే తొలకరి వర్షపు నీటిని దాచేందుకు అవకాశం లభించనుందని చెప్పారు. భూగర్భ జలాలు పెరిగిన చోట వర్షాలు కూడా అధికంగా కురుస్తాయని పేర్కొన్నారు. నివాస గృహాలతో పాటు ఖాళీ స్థలాలు, ప్రభుత్వ భవనాల వద్ద ఇంకుడు గుంతలు తవ్వాలని సూచించారు.గతంలో ప్రతి ఇంట్లో ఇంకుడు గుంతలు ఉండేవని, సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందిన తర్వాత ఇవి కనిపించడం లేదంన్నారు. నీరు ఇంకకపోవడంతో ఇప్పుడు ఇబ్బందులు పడుతున్నామని, ఈ సమస్యను ఎదుర్కొనేందుకు అందరం ఇళ్ళల్లో తప్పనిసరిగా ఇంకుడు గుంతలు తీసుకుందామని పేర్కొన్నారు.

తాజావార్తలు