చిన్న నోట్లు లేక ఇబ్బందులు

chandrababu-naidu-pti_647_080216012602రాష్ట్రం చిల్లర నోట్ల సమస్య ఎదుర్కొంటున్న నేపథ్యంలో 10 వేల కోట్ల చిన్న నోట్లను పంపాలని రిజర్వు బ్యాంక్ అధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. ఇ-పోస్ యంత్రాలను 80 శాతం రాయితీపై సరఫరా చేయాలని, ఆన్‌లైన్ లావాదేవీలకు ప్రోత్సాహకాలు ఇవ్వాలని కోరారు. విజయవాడలోని కమాం డ్ కంట్రోల్ సెంటర్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సిఎం మాట్లాడుతూ చిన్న నోట్లు చలామణిలో లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. చిన్న నోట్లవల్ల ఆర్థిక లావాదేవీలు సాఫీగా సాగుతాయన్నారు. క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు, రూపే కార్డు వంటి కార్డుల ద్వారా చెల్లింపులు చేస్తే చిల్లర సమస్య ఉండదన్నారు. ఆర్టీసీ, మీ-సేవ, తదితరచోట్ల ఇ-పోస్‌లను ఎక్కువగా ఏర్పాటు చేస్తున్నామని, అందువల్ల కొంతమేరకు ఇబ్బందులు తగ్గుతాయన్నారు. ఆన్‌లైన్ లావాదేవీలు జరిపినప్పుడు కమిషన్, సర్‌చార్జీల వసూళ్లను నిలిపివేసి, ప్రోత్సాహకాలు ఇవ్వాలన్నారు. రాష్ట్రంలోని డిసిసిబిలను పాత నోట్లను తీసుకునేందుకు అనుమతించకపోవడం సరికాదన్నారు. సహకార బ్యాంక్‌ల్లో రైతులు రుణాల చెల్లింపులను పాత నోట్ల ద్వారా చెల్లించేందుకు అనుమతించాలని కోరుతున్నట్లు వెల్లడించారు. 

తాజావార్తలు