తెలంగాణ – మహరాష్ట్ర సరిహద్దులో భారీ ఎన్‌కౌంటర్
-మృతుల్లో ఐదుగురు మహిళలు
– పీఎల్‌జిఎ వారోత్సవాలు భగ్నం
మహాదేవపూర్,డిసెంబర్ 6,(జనంసాక్షి): మహారాష్ట్రలోని మావోయిస్టులకు గట్టిఎదురు దెబ్బతగిలింది.. గత ఐదు రోజులుగా ఇన్ఫార్మర్ల గా ఆరోపిస్తు మావోయిస్టులు పలువురుని హతమార్చుతూ వస్తున్నారు. దీనిని తీవ్రంగా పరిగణించిన భద్రతాబలగాలు గత ఐదురోజులుగా గాలింపు చర్యలు చేపట్టారు. గాలింపు చర్యల్లో భాగంగా గడ్చిరోలి జిల్లా సిరొంచ మండలం జంగనూరు సవిూపంలోని అటవీ ప్రాంతంలో బుధవారం మావోయిలు ఎదురుపడటంతో భద్రతాబలగాలకు మావోయిస్టులకు ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఉదయం 7గంటల సమయంలో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. భద్రతా బలగాలకు, మావోయిస్టులకు మధ్య భీకరమైన ఎదురుకాల్పులు జరిగాయి. ఎదురుకాల్పుల్లో ఏడుగురు మావోయిస్టులు మృతి చెందారు. మృతుల్లో ఐదుగురు మహిళా మావోయిస్టులు ఉన్నారు. సంఘటనా స్థలంలో ఆయుధాలు, మావోయిస్టుల కిట్‌బ్యాగ్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కాగా మరికొంత మవోలుయిస్టులు తప్పించుకున్నారు. వీరికోసం బలగాలు గాలిస్తున్నాయి. ఎదురుకాల్పుల నేపథ్యంలో పోలీసులు అక్కడ కూంబింగ్ ముమ్మరం చేశారు. వివరాల్లోకి వెళితె…
మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాల సరిహాద్దుల్లో ఉన్నటువంటి వెలనూర్, కల్లెడ్ అటవీ ప్రాంతంలో పోలీసులకు, మావోయిస్టులకు మధ్య జరిగిన పోరులో మహారాష్ట్ర పోలీసులు విజయం సాధించారు. ఎడుగురు మావోయిస్టులను హాతమార్చి పిఎల్‌జిఎ వారోత్సవాలను భంగ్నం చేసింది. బుధవారం రోజున ఉదయం 5గంటల ప్రాంతంలో ప్రతి సంవత్సరం తెలంగాణ రాష్ట్రంలోని మల్హర్ మండలం కొయ్యూర్ గ్రామమైన అటవీప్రాంతంలో 1999న పిపుల్స్‌వార్‌కు సంబంధించిన కేంద్ర కమిటీ సభ్యులు శీలం సరేష్ అలియాస్ గణేష్, నల్లా ఆదిరెడ్డి అలియాస్ స్వామి, ఎర్రంరెడ్డి సంతోష్‌రెడ్డి అలియాస్ మహేశ్‌లను ఎన్‌కౌంటర్ చేసినప్పడి నుండి పిపుల్స్‌వార్ పార్టీ మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ , ఆంధ్ర, తెలంగాణ, ఒరిసా రాష్ట్రాల్లో పోలీసుల చేతుల్లో హాతమైన కేంద్ర కమిటీ సభ్యులను స్మరిస్తూ ప్రతి సంవత్సరం పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ ఉత్సవాలను నిర్వహిస్తూ వస్తున్నారు. నక్సలిజంపై అవగాహన పెంచుతూ ప్రజల్లో నూతన ఉత్సహాన్ని పెంచే విధంగా భారీగా మావోయిస్టులు గ్రామాల్లో నుండి తరలివెళ్లి ప్రజలను ఉద్దేశిస్తూ నూతనంగా వచ్చే ప్రజలను చేర్చుకునేందుకు వారు ప్రయత్నాలు చేస్తారు. ఈ వారోత్సవాల్లో భాగంగా మావోస్టు ఉద్యమానికి నష్టం కలిగించిన వారిని హతమార్చడం కూడా జరుగుతుంది. ఇదే తరుణంలో మావోయిస్టులు ఈ ఉత్సవాలను భారీగా సన్నహాలు చేస్తూ ఈనెల 1వ తేదిన ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం సాంగినీ జిల్లా కిష్టరాం అడువుల్లో మావోయిస్టులు అమర్చిన మందు పాత్రకు 208 బెలాలీయన్‌కు సంబంధించిన జవాన్‌ను హతమార్చి పిఎల్‌జిఎ ఖాతాను తెరిచాడు. ఇదే కాకుండా మంచిర్యాల్ జిల్లాలోని చెన్నూర్ తాలుకాలో కోటపల్లి, పారుపల్లి గ్రామాల్లో మావోయిస్టులు పిఎల్‌జిఎ వారోత్సవాలను ఘనంగా నిర్వహించాలని పిలుపునిస్తూ వాల్ పోస్టర్లను వేశారు. ఇలా మావోయిస్టులు కొయ్యూర్ ఎన్‌కౌంటర్‌ను స్మరిస్తూ వారోత్సవాలను ఘనంగా నిర్వహించుకుంటూ తమ పూర్వవైభవం చాటుకుంటూ ముందుకు వెళ్లే తరుణంలో మావోయిస్టులకు ఎదురుదెబ్బ తగిలింది. తెలంగాణ సరిహాద్దు ప్రాంతంలో ఉన్నటువంటి మహారాష్ట్ర గడ్చురొలి జిల్లా సిరివంచ తాలుక నుండి 40కిలోమీటర్ల దూరంలో జనగనూర్ గ్రామంలో కోల్లెడ్ అటవీ ప్రాంతంలో మావోయిస్టులు మహారాష్ట్ర కమిటీ పిఎల్‌జిఎ వారోత్సవాల సందర్భంగా ఆ రాష్ట్రంలో ఉన్న మావోయిస్టులకు సమాచారం ఇచ్చి మంగళవారం రాత్రి ప్లినరీ సమావేశం ఏర్పటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో మావోయిస్టులు మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ , తెలంగాణ రాష్ట్రం టిఎల్‌జిఎ వారోత్సవాలకు సంబంధించిన ప్రక్రియను ఏర్పటు చేస్తున్న తరుణంలో మహారాష్ట్ర పోలీసులకు అందిన పక్క సమాచారం మేరకు పోలీసులు అటవీ ప్రాంతానికి చేరుకొని భారీగా గుమ్ముడిన మావోయిస్టులను గమనించిన పోలీసులు మావోయిస్టులపై కాల్పులు మొదలు పెట్టారు. ఈ కాల్పుల్లో ఎదురుకొలేని మావోయిస్టులు భారీ సంఖ్యలో పారిపోయారు. పోలీసుల కాల్పుల్లో ఎడుగురు మావోయిస్టులు హతమైయ్యారు. భారీ తుపాకులు, మందుపాత్రలు, ఇతర సామాగ్రిని పోలీసులు స్వధీనం చేసుకున్నారు. మృతుల వివరాలు ఇంకా వెల్లడి కాలేదు. కొత్తగా ఉద్యమం లోకి వెళ్లిన అదిలాబాద్ ప్రాంత వాసుల తల్లిదండ్రులు తమ పిల్లలు ఎమైన ఉన్నారా అని ఆందోళన చెందుతున్నారు.