వెల్లూరులో అగ్నిప్రమాదం

రూ.5లక్షల ఆస్తి నష్టం

జెజ్జూరు: మండలంలోని వెల్లూరి గ్రామంలో చౌదరి గోపాల్‌కు చెందిన ఇల్లు బుధవారం తెల్లవారు జామున విద్యుదాఘాతానికి గురై దగ్థమయ్యింది. ఈ మంటల్లో వంద క్వింటాళ్ల పత్తి, 20 బస్తాల వడ్లు, క్వింటాల్‌ పెసలు, రూ.5వేల నగదు, 7తులాల బంగారం తదితర వస్తువులు కాలి బూడిదయ్యాయి. చుట్టుపక్కల ప్రజలు మంటలను చల్లార్చారు. వీఆర్వో నారాయణ పంచనామా నిర్వహించి రూ. 5లక్షల నష్టం వాటిల్లినట్లు అంచనా వేశారు. తక్షణ సాయం కింద రూ. 4వేలను బాధితునికి అందజేశారు.