సాగునీటి అభివృదద్‌ఇతో వ్యవసాయానికి పెద్దపీట : మంత్రి పల్లె

అనంతపురం,ఏప్రిల్‌5(జ‌నంసాక్షి): వ్యవసాయాన్ని పండగ చేసేందుకే సిఎం చంద్రబాబు నాయుడు సాగునీటి రంగానికి భారీగా నిధులు కేటాయిస్తూ నదుల అనుసంధానానికి కృషిచేస్తున్నారని మంత్రి పల్లె రఘునాథ రెడ్డి అన్నారు. చంద్రబాబు కృషి కారణంగారానున్న రెండుమూడేళ్లలో అనంతలో సాగునీటికి ఇబ్బందులు తొలగిపోగలవని,రైతాంగం ఆనందంగా ఉండగలదన్నారు. రైతులు బాగుంటేనే అందరూ బాగుంటారన్నారు.  దుర్భర పరిస్థితుల నుంచి సాంకేతిక పరిజ్ఞానంతో యువరైతులను ఆదుకుని వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కంకణం కట్టుకున్నాయన్నారు.  హంద్రీ-నీవా ద్వారా రాయలసీమకు నీళ్లు తీసుకువచ్చి ఇక్కడ పంట పొలాలను సస్యశ్యామలం చేసేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి కంకణబద్ధులై ఉన్నారన్నారు. సాగునీటి రంగంతో పాటు నీరుచెట్టు పథకంతో చెరువులను పెద్ద ఎత్తున పునరుద్దరించే కార్యక్రమాలు జరుగుతున్నాయని అన్నారు. రైతుల భూముల వివరాలన్నీ ఆన్‌లైన్‌లో పొందుపరిచేందుకు చర్యలు తీసుకుంటామని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ సమస్య నిర్మూలనే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు మంత్రి  తెలిపారు. రాష్ట్రంలోని వివిధ శాఖల్లో త్వరలో 20 వేల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు తెలిపారు. అంబేద్కర్‌ జయంతిని పురస్కరించుకుని రాష్ట్రవ్యాప్తంగా ఆరు లక్షల ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుడుతున్నట్లు చెప్పారు. త్వరలో గ్రావిూణ ఉపాధి హావిూ పథకం కింద పనిచేస్తున్న కూలీలకు కనీస వేతనాన్ని రూ.194లకు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. వేసవిలో కూలీలకు మజ్జిగ కూడా పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు.  ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో నెలకొన్న సమస్యలను స్వయంగా తెలుసుకునేందుకు గతంలో లాగానే ఆయా ప్రాంతాల్లో నిద్రించేందుకు ఏర్పాట్లు చేపడుతున్నట్లు మంత్రి పల్లె వెల్లడించారు. ప్రభుత్వ అధికారులు, సిబ్బంది అవినీతికి పాల్పడితే సహించేది లేదని మంత్రి హెచ్చరించారు.తాగునీటి ఎద్దడి నివారణకు తక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

తాజావార్తలు