ఇబ్బందులు ఉంటే రైతులు చెప్పాలి: జెసి

 

జగిత్యాల,నవంబర్‌6(జ‌నంసాక్షి): ఇప్పటివరకు జిల్లాలో 60వేల క్వింటాళ్ల ధాన్యం సేకరణ జరిగిందని జాయింట్‌ కలెక్టర్‌ బేతి రాజేశం అన్నారు. ధాన్యం సేకరణలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా జిల్లాలోని ఆయా శాఖల అధికారులతో ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తున్నామన్నారు. జిల్లాలో ఖరీఫ్‌ సీజన్‌లో 152ఐకేపీ కేంద్రాలు, 170 సహకార సంఘం సెంటర్లతో కలిపి మొత్తం 322కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ వారంలో వచ్చిన ధాన్యాన్ని ఆయా సెంటర్ల ద్వారా ఎలాంటి ఇబ్బందులు లేకుండా సేకరిస్తున్నామన్నారు. జిల్లా కేంద్రంలో కాల్‌ సెంటర్‌ ద్వారా ఎప్పటికప్పుడు కొనుగోలు పక్రియను, రైస్‌మిల్లుల కేటాయింపు, గన్నీ సంచుల సరఫరా, రవాణా ఏర్పాట్లపై ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. జిల్లాలోని ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ధాన్యం కొనుగోలు కేంద్రంలో ఏమైనా ఇబ్బందులుంటే తెలపాలని రైతులకు సూచించారు. ఇబ్బందులు ఉంటే కాల్‌ సెంటర్‌కు ఫోన్‌ చేయాలన్నారు.