ఎమ్మెల్సీ ఎన్నికలకు ఏర్పాట్లు

కామారెడ్డి,మార్చి13(జ‌నంసాక్షి): పట్టభద్రుల, ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా అన్ని పోలింగ్‌ కేంద్రాల్లో పకడ్బందీ ఏర్పాట్లు చేపడుతున్నట్ల కలెక్టర్‌ సత్యనారాయణ తెలిపారు. పోలింగ్‌ పక్రియపై అధికారులకు అవగాహన ఉండాలని సూచించారు. పోలింగ్‌ రోజు ప్రతీ కేంద్రంలో వంద శాతం వెబ్‌కాస్టింగ్‌, వీడియోగ్రఫీ, మైక్రో అబ్జర్వర్ల నిఘా ఉంటుందని స్పష్టం చేశారు. జిల్లాలో 30 పోలింగ్‌ లోకేషన్లు ఏర్పాటు చేశామని తెలిపారు. ఇందులో 20 చొప్పున కామన్‌ పోలింగ్‌ కేంద్రాలు, రెండు ఉపాధ్యాయులకు సంబంధించి, 8 పట్టభద్రులకు కలిపి మొత్తం 50 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు వివరించారు.  కేంద్ర ఎన్నికల సంఘం ప్రతీ విషయాన్ని గమనిస్తుందని తెలిపారు. పోలింగ్‌ రోజున చెక్‌లిస్టు, లే అవుట్‌ ప్రకారం విధులు నిర్వహించాలని సూచించారు. /ఖరచబేద  లోక్‌సభ ఎన్నికల ప్రకటన కారణంగా మాడల్‌ కోడ్‌ ఆఫ్‌ కండక్ట్‌లో భాగంగా ప్రభుత్వ స్థలంలో రాజకీయ పార్టీల ఫొటోలు తీసివేస్తామని, ఇందుకు మండల స్థాయి అధికారులు, రెవెన్యూ, పోలీస్‌ శాఖల వారు చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ సత్యనారాయణ సూచించారు.  రాజకీయ పార్టీల ఫ్లెక్సీలు, ¬ర్డింగులు తీసివేయాలన్నారు. కోడ్‌లో భాగంగా కొత్తగా ఎ టువంటి పనులు ప్రారంభం చేయవద్దన్నారు. ప్రకటనలకు సంబంధించిన విూడియా సర్టిఫికేషన్‌ ఎంసీఎంసీ ద్వారా పొందాలన్నారు. వికలాంగులు 16,500 మందికి వీల్‌ చైర్‌, ఆటో సౌకర్యం పోలింగ్‌ రోజు కల్పిస్తామన్నారు. గత ఎన్నికల వరకు 373 నాన్‌బెయిలబుల్‌ వారెంట్‌ ఇష్యూ చేశామని తెలిపారు. 218 మందిపై చర్యలు తీసుకున్నామన్నారు.