కెసిఆర్‌ నాయకత్వం దేశానికి అవసరం

అన్ని ఎంపి స్థానాలు గెలవాల్సిందే: ఎమ్మెల్యే
నిజామాబాద్‌,మార్చి26(జ‌నంసాక్షి): భారత దేశం కేసీఆర్‌ నాయకత్వం కోసం ఎదురు చూస్తోందని ఆర్మూర్‌ ఎమ్మెల్యే జీవన్‌ రెడ్డి అన్నారు. తెలంగాణలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ పథ కాలతో కేసీఆర్‌ నాయకత్వంపై ప్రజలకు సంపూర్ణ నమ్మకం ఏర్పడిందని వివరించారు. ఈ ఎన్నికల్లో మనమంతా 16సీట్లు గెలిస్తే దేశ రాజకీయాల్లో కెసిఆర్‌ కీలకం అవుతారని అన్నారు. అందుకే ప్రజలంతా ఎంపి ఎన్నికల్లో భారీగా పాల్గొని ఓటేయాలని అన్నారు. కాంగ్రెస్‌, బీజేపీ నేతలు ఈ దేశాన్ని ఏలినా అభివృద్ధిలో మాత్రం చాలా
వెనకబడి పోయామన్నారు. ఈ రెండు పార్టీల ఏలుబడి నుంచి దేశాన్ని బయటపడేయాల్సిన అసవరం ఉందని అన్నారు. అందుకే కేసీఆర్‌ ఫెడరల్‌ ఫ్రంట్‌ ఏర్పాటు చేశారని  చెప్పారు. బీజేపీ రాష్ట్రంలో అమలు చేస్తున్న పథకాలపై గోబెల్స్‌ ప్రచారం చేస్తోందని విమర్శించారు.దేశం అభివృద్ధి చెందాలంటే కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రధానమంత్రి కావాలని  అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా వివిధ గ్రామాల్లో ఆయన ప్రజలను కలుసుకుని మాట్లాడారు. కేసీఆర్‌ ఏర్పాటు చేసిన ఫెడరల్‌ ఫ్రంట్‌ దేశ రాజకీయాల్లో కీలకం కాబోతోందన్నారు. కేసీఆర్‌ దేశ ప్రధాని అయితే దేశంలోని మిగిలిన రాష్ట్రాల్లో ఉన్న బీడీ కార్మికలందరికీ జీవన భృతి దొరుకుతుందన్నారు. దేశ ప్రధానిగా ఉన్న నరేంద్రమోదీ సొంత రాష్ట్రంలో వృద్ధులకు ఇచ్చే పింఛన్‌ కేవలం రూ.750 మాత్రమేనని, మన రాష్ట్రంలో రూ.1000 చెల్లి స్తున్నామన్నారు. వచ్చే మే నెల నుంచి రూ.2 వేలు అవుతుందని వెల్లడించారు. దేశంలో పేదరికం ఇంకా ఉందని అన్నారు. దేశాన్ని తాము అన్ని రంగాల్లో అభివృద్ధి చేశామని గొప్పలు చెప్పే కాంగ్రెస్‌, బీజేపీ నాయకులు పేదరికం గురించి మాత్రం పెదవి విప్పడం లేదని ఎద్దేవా చేశారు.  మే నెల నుంచి వృద్ధులు, వి తంతువులు, బీడీ కార్మికులకు రూ.2వేల చొప్పున పింఛన్‌ అందుతుందని తెలిపారు. రాబోయే రోజుల్లో పేద ప్రలజందరికీ డబుల్‌ బెడ్‌ రూంలు ఇళ్లు కట్టించి తీరుతామని ప్రకటించారు. అందుకు తగిన విధంగా ప్రణా ళికలు సిద్ధం చేశామన్నారు. టీఆర్‌ఎస్‌ ప్రాంతీయ పార్టీ అని, ఆ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తే ఢిల్లీలో ఏం చేస్తారని కాంగ్రెస్‌, బీజేపీ నాయ కులు చేస్తున్న ప్రచారాన్ని తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు.