గుణాత్మక విద్యతోనే పురోగతి

కరీంనగర్‌,సెప్టెంబర్‌11 ( జనంసాక్షి ) :   నాణ్యమైన, గుణాత్మక విద్యతోనే అన్ని రంగాల్లో రాణించే అవకాశాలున్నాయనీ  జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రం నిర్వాహకులు అన్నారు. ఇక్కడ జరిగిన కార్యక్రమంలో పిల్లలకు చంద్రయాన్‌ విశేషాలను వివరించారు.ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దే బాధ్యత ఉపనాధ్యాయులపై ఉందన్నారు.  దేశం ఆర్థికాభివృద్ధి సాధించాలంటే కేవలం విద్యతోనే సాధ్యమనీ అన్నారు. అందరూ బాగా చదువుకొని సమాజానికి సేవ చేయాలని పేర్కొన్నారు. యువత చేతిలోనే దేశ భవిష్యత్‌ ఉందనీ, నేటి యువత వ్యవసాయం దిశగా సాగాలని పిలుపునిచ్చారు. గౌరవమైన వృత్తిగా వ్యవసాయాన్ని భావించాలనీ, వ్యవసాయ విద్యను చదువుతున్న ప్రతి విద్యార్థికి శుభాకాంక్షలు తెలిపారు. విూతోనే మళ్లీ వ్యవసాయానికి పాత రోజులు రావాలనీ, ప్రపంచం మరోసారి మన వ్యవసాయం వైపు చూడాలని పేర్కొన్నారు. రైతులకు సరైన గౌరవాన్ని అందించాలనీ, టెక్నాలజీకనుగుణంగా మార్పు రావాలని సూచించారు. చక్కని సారవంతమైన భూములు దేశంలో ఉన్నాయనీ, సేంద్రియ సాగు చేయాలని రైతుల్లో చైతన్యం తీసుకురావాలని తెలిపారు. సేవా దృక్పథం నడిచేది ఒక్క వ్యవసాయ మేననీ, సాగును ప్రోత్సహించాలని సూచించారు. పుస్తకాలనే కాదు విద్యార్థులు సమాజాన్ని కూడా చదవాలని అన్నారు. గొప్ప శాస్త్రవేత్తలుగా ఎదగాలని పేర్కొన్నారు. వ్యవసాయ విద్యను చదువుకునే ప్రతీ విద్యార్థి రైతులను విలువైన సమాచారాన్ని అందించాలనీ, సాంకేతికత దిశగా నడిపించాలని పిలుపునిచ్చారు. గ్రావిూణ జీవన విధానం గొప్పదన్నారు. దేశంలో విద్యావ్యాప్తి ఇంకా జరగాలనీ, కేవలం 24శాతం మంది విద్యార్థులు మాత్రమే ఉన్నత విద్య వైపు సాగుతున్న విషయాలను వివరించారు. విద్యార్థినులు కూడా వ్యవసాయ విద్యను అభ్యసించడాన్ని ప్రశంసించారు. ఇక్కడి రైతాంగానికి, విద్యార్థులకు అన్ని విధాలా సహకారం, సలహాలను అందిస్తున్న కేవీకే సేవలను అభినందించారు.