డెంగ్యూ నివారణపై ర్యాలీ

భద్రాద్రికొత్తగూడెం,మే16(జ‌నం సాక్షి): జాతీయ డెంగ్యూ నివారణా దినోత్సవం సందర్భంగా  గుమ్మడివల్లి పి.హె.సి. ఆద్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. డెంగ్యూ వ్యాధి ఇడిస్‌..ఈజిప్టిఐ అనే దోమ కాటువల్ల వ్యాపిస్తుందని , తీవ్రమైన జ్వరం, కంటి గుంటల దగ్గర అంటే కణతల వద్ద నొప్పి, సరి అయిన సమయంలో గుర్తించక పోతే వంటిపై దద్దుర్లు, అంతర్గత రక్తస్రావం జరుగుతుందని అన్నారు. దీంతో ఒక్కోసారి అపస్మారక స్థితిలోకి  వెళ్లే ప్రమాదం ఉందని ,సరిఅయిన సమయంలో రోగలక్షణాలను గుర్తిస్తే  ,చికిత్స చేయవచ్చు అని ,ముఖ్యంగా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ,దోమలు పెరగ కుండా ,కుట్టకుండా ,జాగ్రత్తలు తీసుకోవాలని ,ప్రజలకు ఆరోగ్య అవగాహన కలుగ చేశారు. ఈ కార్యక్రమంలో మెడికల్‌ ఆఫీసర్‌. డా.హరీష్‌ ,గారు ,హెల్త్‌ సూపర్‌ వైజర్‌ పి.వి.రమణారావు, హె.వి.దుర్గమ్మ ,హెల్త్‌ అశిష్టెంట్‌ భాస్కర్‌, ఏ.ఎన్‌.ఎమ్స్‌. సావిత్రి ,రేవతి ,రాథాబాయి , ల్యాబ్‌ టెక్నినిషియన్‌ సతీష్‌, ఆశ కార్యకర్తలు ,ఇతర సిబ్బంది ,పాల్గొన్నారు