పాక్‌ను ఎండగడుతూ ఉండాల్సిందే!

ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్థాన్‌ తను సృష్టించుకున్న ఉగ్రవాదానికి బలవుతున్నా దానికి బుద్ది రావడం లేదు. భస్మాసుర హస్తంలా తనకుతాను దహించుకుపోతున్నా భారత్‌లో ఉగ్రవాదాన్ని ఎగదోస్తోంది. అక్కడ భారత్‌కు వ్యతిరేకంగా ఉగ్రమూకలు ర్యాలీలు తీసినా, ఆందోళనలు చేసినా పట్టించుకోవడం లేదు. ఉగ్రమూకల దాడికి అమాయక ప్రజలు నిత్యం ప్రాణాలు వదులుతున్నా పట్టించుకోవడం లేదు. నిజానికి 1947లో దేశ విభజన సమయంలో మన నేతలు గట్టిగా నిలిచివుంటే ఇవాళ పాకిస్తాన్‌ అన్న దేశం ఉండేది కాదు. కేవలం ముస్లింలకు ఓ దేశం ఉండాలన్న బ్రిటిష్‌ కుట్రలకు ఆనాటి నేతలు తలొగ్గి పాక్‌ను ఏర్పాటు చేశారు. విభజన సమయంలో రక్తపాతమే జరిగింది. లక్షలాది ప్రజలు తమ ప్రాణాలు కోల్పోయారు. పాక్‌లో ఉన్న లక్షలాది హిందువులు హత్యలకు గురయ్యారు. ఆ తరవాత బలవంతపు మతమార్పిడుల్లో మసై పోయారు. కాశ్మీర్‌లో కొంత భాగాన్ని భారత్‌ వదులుకోవాల్సి వచ్చింది. మనతో యుద్దాలు చేసి ఓటమి పాలయ్యింది. అయినా ఔరంగా జేబులాగా భారత్‌పై దాడికి తెగిస్తూనే ఉంది. ఔరంగాజేబును క్షమించి వదిలేస్తే ఏం జరిగిందో మనకు తెలియంది కాదు. అలాగే పాక్‌నుకూడా పొరుగదేశంగా క్షమించాల్సిన అవసరం లేదు. అక్కడి పాలకులు ఎవరైనా ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్నవారే. అందుకే చాలాకాలం తరవాత భారత్‌ వైఖరిలో మార్పువచ్చింది. మోడీ ఎంతగా స్నేహహస్తం చాచినా నవాజ్‌ షరీఫ్‌ వైఖరిలో మార్పు రాలేదు…రాదు కూడా. కాశ్మీర్‌లో వేలుపెడుతూ మన దేశంలో ఉగ్రవాదులకు ఊతమిస్తున్న సంఘటనలు కోకొల్లలు. అలాంటి దేశాన్ని ఉపేక్షించేది లేదని గుర్తించి సార్క్‌ వేదికగా మన¬ం మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ గట్టిగానే హెచ్చరించారు. రాజ్‌నాథ్‌ ప్రసంగం ప్రసారం కాకుండా పాక్‌ నేతలు కుట్రలు పన్నారు. సార్క్‌లో ఇలాంటి దౌర్భాగ్యం చోటు చేసుకోవడం దుర్మార్గం కాక మరోటి కాదు. అందుకే ఆ దేశంలో సార్క్‌ సదస్సులను కూడా నిర్వహించే అర్హత లేకుండా చేయాలి. అయితే సార్క్‌ వేదికగా ఉగ్రవాదులను ప్రోత్సహించడం, వారిని కీర్తించడం మానుకోవాలని పాకిస్థాన్‌కు భారత్‌ గట్టి సందేశమిచ్చింది. ఉగ్రవాదానికి వంత పాడుతున్న దేశాలపై కఠిన చర్యలు తీసుకోవాలని పిలుపునిచ్చింది. ఇస్లామాబాద్‌లో జరిగిన 7వ సార్క్‌ కూటమి ¬ం మంత్రుల సమావేశంలో భారత ¬ం మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ చేసిన ప్రసంగం పాక్‌కు హెచ్చరిక కావాలి. ఇంత ఘాటుగా బహుశా గతంలో ఎవరు కూడా మాట్లాడి ఉండరు. చైనా దొంగ స్నేహంతో పాక్‌ ఈ మధ్య రెచ్చిపోతున్న తీరు ఇటీవలి కాశ్మీర్‌ ఘటనలు చూస్తేనే అర్థం చేసుకోవచ్చు. భారత్‌-పాక్‌ మధ్య క్షీణించిన సంబంధాలు ఈ సదస్సులో రాజ్‌నాథ్‌ ప్రసంగం ద్వారా ప్రతిబింబించాయి. రాజ్‌నాథ్‌-పాక్‌ ¬ంమంత్రి చౌధురి నిసార్‌ అలీ ఖాన్‌ మధ్య ద్వైపాక్షిక భేటీ జరగలేదు. సమావేశంలో ముఖాముఖీ ఎదురుపడ్డ వారిద్దరి మధ్య కరచాలనం కూడా చాలా ముభావంగా సాగింది. సమావేశం తర్వాత పాక్‌ ¬ం మంత్రి ఇచ్చిన విందుకు కూడా రాజ్‌నాథ్‌ హాజరుకాలేదు. ఇవన్నీ అర్థం చేసుకునే రీతిలో పాక్‌ వైఖరి లేదు. సదస్సులో భారత ¬ం మంత్రి హిందీలో ప్రసంగించిన తీరు ఉగ్రవాదానికి అది ప్రోత్సహిస్తున్న తీరుకు అద్దం పట్టింది. పాక్‌ పేరు ప్రస్తావించకుండానే ఆ దేశానికి కఠిన పదజాలంతో విస్పష్ట సందేశమిచ్చారు. ఉగ్రవాద చర్యలను ఖండించడం ఒక్కటే సరిపోదని అంటూ వారు ఎక్కడున్నా తుదముట్టించాల్సిందే అన్నారు. ఎక్కడా మంచి ఉగ్రవాదులు.. చెడ్డ ఉగ్రవాదులు ఉండరని పేర్కొన్నారు. తీవ్రవాదం ఈ ప్రాంతానికి అతిపెద్ద సవాల్‌గా మారిందని చెప్పారు. ఒక దేశపు ఉగ్రవాది మరో చోట అమరవీరుడు లేదా స్వాతంత్య్ర సమరయోధుడు కాజాలడు. ఎలాంటి పరిస్థితుల్లోనూ ఉగ్రవాదులను అమరవీరులుగా కీర్తించవద్దని ఘాటుగానే పేర్కొన్నారు. కశ్మీర్‌లో భద్రతా దళాల కాల్పుల్లో మరణించిన హిజ్బుల్‌ ముజాహిదీన్‌ కమాండర్‌ బుర్హాన్‌ వానిని ‘అమర వీరుడి’గా నవాజ్‌ కీర్తించిన సంగతిని ఇలా రాజ్‌నాథ్‌ తన ప్రసంగం ద్వారా గుర్తు చేశారు. ఉగ్రవాదంపై పాక్‌ వైఖరిని ఎండగడుతూనే ఇటీవలే మనం పఠాన్‌కోట్‌, ఢాకా, కాబుల్‌ తదితర చోట్ల ఉగ్రవాదుల దాడులను ప్రస్తావించారు.తీవ్రవాదులు సామాజిక, డిజిటల్‌ మాధ్యమాలను దుర్వినియోగం చేస్తున్నారని రాజ్‌నాథ్‌ చెప్పారు.యువతను తప్పుదోవ పట్టించడానికి, ఉగ్రవాదాన్ని వ్యాప్తి చేయడానికి వీటిని వాడకుండా చూడాలని కోరారు. ఉగ్రవాదం, మాదక ద్రవ్యాలు, నకిలీ కరెన్సీ, అక్రమ నిధులు వంటివాటిపై పర్యవేక్షణ విభాగాలను బలోపేతం చేయాలని రాజ్‌నాథ్‌ పిలుపునిచ్చారు. వ్యవస్థీకృత నేరాలన్నింటితో వీటికి సంబంధం ఉంటోందన్నారు. కశ్మీర్‌లో అమాయక ప్రజలపై జరుగుతున్న హింస బహిరంగ ఉగ్రవాదమే అని వ్యాఖ్యానించారు. పాకిస్థాన్‌ గడ్డపై జరుగుతున్న సార్క్‌ సమావేశాలను వేదికగా చేసుకొని పాక్‌ ఉగ్ర కార్యకలాపాలపై సూటిగా విరుచుకుపడడం ద్వారా భారత్‌ గట్టి సందేశాన్ని ఇచ్చింది. ఇదే మన విధానం కావాలి. ఇకముందు దానికి గట్టిగా బుద్ద ఇచెప్పడమే లక్ష్యంకావాలి. సరిహద్దుల్లో కఠినంగా వ్యవహరించాలి. ప్రపంచ దేశాల్లో దాని అనైతిక ఉగ్రచర్యలను ఎండగడుతూ ఇతర దేశాల నుంచి వేరు చేయాలి. పాక్‌ లేదా ఇతర ప్రపంచ విూడియాలను అడ్డుకోవడం ద్వారా పాక్‌ తన చర్యలను తాత్కాలికంగా సమర్థించుకోవచ్చు. కానీ ఉగ్రవాదులకు ఊతమిస్తున్న విషయాన్ని ప్రపంచానికి తెలయకుండా చేయలేదు. భారత్‌తో స్నేహసంబంధాలు కోరుకుంటే దానికే మంచిది. కయ్యానికి కాలుదువ్వితే ఏం జరుగుతుందో గతానుభవాల నుంచి పాక్‌ పాఠాలు నేర్వాలి.