పేదల ఆత్మగౌరవ కోసమే డబుల్ బెడ్‌రూం ఇండ్లు

ఖమ్మం : టీఆర్‌ఎస్ ప్లీనరీలో భాగంగా కేసీఆర్ ఆత్మగౌరవ పథం – డబుల్ బెడ్‌రూం ఇండ్ల పథకం తీర్మానాన్ని ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు ప్రతిపాదించారు. ఈ సందర్భంగా నారదాసు మాట్లాడుతూ.. రాతి యుగం నుంచి రాకెట్ యుగంలోనికి ప్రవేశించినప్పటికీ కొంత మంది ప్రజలకు ఇండ్లు లేవు. ఈ క్రమంలో పేదల ఆత్మగౌరవమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ డబుల్ బెడ్‌రూం ఇండ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. గతంలో పాలకులు కూడా ఇండ్లను కట్టించి ఇచ్చారు. అవి డబ్బా ఇండ్లు, కోళ్ల గూడు మాదిరిగా ఉండేవి. పేదల ఆత్మాభిమానం దెబ్బతినొద్దనే ఉద్దేశంతో కేసీఆర్ డబుల్ బెడ్‌రూం ఇండ్ల నిర్మాణానికి సంకల్పం తీసుకున్నారు. పేదల ఆత్మగౌరవం పెంచే విధంగా డబుల్ బెడ్‌రూం ఇండ్ల నిర్మాణం జరుగుతుందన్నారు. డబుల్ బెడ్‌రూం ఇల్లు – ఇల్లు మాత్రమే కాదు. ఆత్మగౌరవానికి ప్రతీక అని తెలిపారు.