ప్రజలు కెసిఆర్‌ పట్ల విశ్వాసం ప్రకటించారు

మా విజయానికి అదే నిదర్శనం: జలగం

భద్రాద్రికొత్తగూడెం,జనవరి31(జ‌నంసాక్షి): పంచాయితీ ఎన్‌ఇనకలు ప్రశాంతంగా ముగియడంతో పాటు అత్యధిక స్థానాలు టిఆర్‌ఎస్‌కు కట్టబెట్టడం జరిగిందని మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావ్‌అన్నారు. ఇది ప్రజల్లో కెసిఆర్‌ పట్ల ఉన్న విశ్వాసం పెంచిందన్నారు. గ్రామాలు అబివృద్ది కావాలని ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు. గిరిజన గ్రామలను పంచాయితీలుగా చేయడం వల్ల వారు కూడా టిఆర్‌ఎస్‌కు మద్దతు పలికారని అన్నారు. మూడు విడుతలుగా జరిగిన పంచాయతీఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పైచేయిగా నిలవడమే ఇందుకు నిదర్శనమని అన్నారు. పార్టీ బలపర్చిన అభ్యర్థులు జిల్లాలో అత్యధిక స్థానాలు గెలుచుకొని విజయ దుందుభి మోగించారు. వరుసగా మూడు విడుతల్లోనూ టీఆర్‌ సర్పంచ్‌ అభ్యర్థులు సత్తా చాటుకున్నారు. ఏ పార్టీ మద్దతు లేకుండా టీఆర్‌ బలపర్చిన సర్పంచ్‌ అభ్యర్థులు ఘన విజయం సాధించారు. కొత్త పం చాయతీలతో మూడవ విడుత జరిగిన ఎన్నికలు పూర్తి గిరిజన ప్రాంతమైన జిల్లాలోని మొత్తం 163 సర్పంచ్‌ స్థానాల్లో 92 సర్పంచ్‌ పదవులను గులాబీ ఖాతాలో జమ చేసుకుంది. బుధవారం జిల్లాలోని ఏడు మండలాల్లో జరిగిన సర్పంచ్‌, వార్డు మెంబర్ల పదవులకు సంబంధించిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో టీఆర్‌ పార్టీ బలపర్చిన అభ్యర్థులు ఘన విజయం సాధించడం ద్వారా మూడో విడతలోనూ అధికార పార్టీ తన ఆధిక్యాన్ని కొనసాగించింది. మూడో విడత ఎన్నికల్లో ఏజెన్సీ ప్రాంతాల్లో అత్యధిక సర్పంచ్‌, ఉప సర్పంచ్‌, వార్డు మెంబర్ల పదవులను కైవసం చేసుకోవడం ద్వారా టీఆర్‌ఎస్‌ స్థానిక సంస్థల్లో తన ఆధిక్యతను మరోసారి నిరూపించిందన్నారు. మూడవ విడత ఎన్నికల్లో 151 సర్పంచ్‌ స్థానాలకు 491 మంది పోటీ పడగా టీఆర్‌ 92 స్థానాల్లో ఘన విజయం సాధించి సర్పంచ్‌ పదవులను గెలుచుకుంది. 1187 వార్డు స్థానాల్లో 2938 మంది పోటీపడగా 76 శాతం వార్డు మెంబర్ల పదవులను టీఆర్‌ దక్కించుకుంది. ఇది కెసిఆర్‌ పట్ల ప్రజలకున్న విశ్వాసానికి నిదర్శనమని జలగం అన్నారు.