ప్రభావం చూపిన వలస ఓటర్లు

అత్యధిక స్థానాల్లో మహిళా అభ్యర్థుల ఎంపిక

తాడ్వాయిలో సర్పంచ్‌గా సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి

కామారెడ్డి,జనవరి22(జ‌నంసాక్షి): పంచాయతీ పోరు ¬రా¬రీగా సాగింది. సర్పంచ్‌ అభ్యర్థుల గెలుపు ఓటములపై వలస ఓటర్లు ప్రభావం చూపారు. వలస వెళ్లిన వారు స్వగ్రామాలకు తరలివచ్చి ఓటు హక్కును వినియోగించు కున్నారు. దీంతో గ్రామాల్లో పండుగ వాతావరణం నెలకొంది. గ్రామ పంచాయతీ ఎన్నికలతో ప్లలెల్లో సందడి నెలకొంది. వలస వెళ్లిన వారు కుటుంబ సభ్యులతో సహా గ్రామాలకు చేరుకొని ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్లలెల్లో పంచాయతీ పోరుతో మరోసారి పట్నం వాసులు ప్లలెలకు పరుగులు తీశారు. రంగంలో ఉన్న సర్పంచ్‌, వార్డు అభ్యర్థులు ప్రతీ ఓటును కీలకంగా భావించి అందరినీ పలకరిస్తూ ఓట్లను రాబట్టుకునే ప్రయత్నం చేశారు. వృద్ధులు, వికలాంగులు, యువతీ యువకులు, మహిళలు, భారీగా తరలివచ్చి క్యూలో ఉండి ఓటు వేశారు. వృద్ధులు చలిని సైతం లెక్క చేయకుండా ఇతరుల సహాయంతో పోలింగ్‌ కేంద్రానికి చేరుకొని ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సారి మహిళలు అధిక సంఖ్యలో పోటీలో ఉన్నారు. ప్రభుత్వం స్థానిక సంస్థలకు మహిళలకు 50 శాతం రిజర్వేషన్‌ కల్పించడంతో భారీ సంఖ్యలో మహిళలు రాజకీయంగా అరంగ్రేటం చేశారు. ప్లలెల్లో మహిళల ఓట్ల శాతం అధికంగా ఉంది. దీంతో ఉదయం నుంచి మహిళలు ఓటింగ్‌ భారీ సంఖ్యలో తరలివచ్చారు. పోలింగ్‌ కేంద్రాల వద్ద మహిళలు బారులుతీరి ఓటు హక్కు వినియోగించుకున్నారు. దోమకొండ మండలంలోని చింతమాన్‌ గ్రామంలో 18 మంది మహిళలు సర్పంచ్‌ పదవికి పోటీ పడ్డారు. మిగితా గ్రామాల్లో సైతం మహిళా రిజర్వేషన్‌ అయిన గ్రామాల్లో భారీ సంఖ్యలో రంగంలో నిలిచారు. జనరల్‌

సర్పంచ్‌ పదవిలోనూ మహిళలు రంగంలో నిలిచారు. తొమ్మిది మండలాల్లో 164 సర్పంచ్‌ పదవుల్లో సగానికి పైగా మహిళలే సర్పంచ్‌ పదవులు అలంకరించారు. తాడ్వాయిలో సర్పంచిగా సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి బండారు సంజీవులు ఘన విజయం సాధించారు. రాజధానిలో సాప్ట్‌వేర్‌ ఉద్యోగాన్ని వదిలి గ్రామ సర్పంచి ఎన్నికల బరిలో దిగారు. శాసనసభ ఎన్నికల సమయంలో తెరాస నుంచి కాంగ్రెస్‌లోకి చేరిన ఆయన సర్పంచి ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగారు. నలుగురు అభ్యర్థులు బరిలోకి దిగారు. మొత్తం 2,817 ఓట్లు పోల్‌ కాగా, సంజీవులుకు 1507 ఓట్లు వచ్చాయి. 556 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. ఓట్ల లెక్కింపు సందర్భంగా నాటకీయ పరిణామాలు చోటు చేసుకోవడంతో ఫలితం ప్రకటన ఆలస్యంమైంది. తొలి రౌండులో సంజీవులుకు, ఆయన సవిూప ప్రత్యర్థి ముదాం నర్సింలకు కంటే 122 ఓట్లు అధికంగా వచ్చాయి. దీంతో రెండో రౌండ్లో తమకు ప్రతి బ్యాలెట్‌ను చూపించిన తరువాతనే లెక్కించాలని ప్రత్యర్థులు పట్టుబట్టారు. ఈ నేపథ్యంలో కౌంటింగ్‌ ఆలస్యమై అర్ధరాత్రి వరకూ కొనసాగింది. చివరకు సంజీవులు భారీ

ఆధిక్యంతో విజయం సాధించారు. ఇకపోతే జిల్లాలో మొదటి విడత పంచాయతీ ఎన్నికలు సోమవారం ప్రశాంతంగా ముగిసాయి. కామారెడ్డి డివిజన్‌ దోమకొండ, బీబీపేట్‌, భిక్కనూరు, మాచారెడ్డి, కామారెడ్డి, రామారెడ్డి, తాడ్వాయి, రాజంపేట్‌, సదాశివనగర్‌ మండలాల్లో 164 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఇందులో 31 సర్పంచ్‌ స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. 134 గ్రామాల్లో 133 సర్పంచ్‌ స్థానాలు, 1022 వార్డులకు ఎన్నికలు జరిగాయి. ప్లలెల్లో పంచాయతీ పోరు ప్రశాంతంగా ముగియడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.