రైతులకు ఇబ్బంది లేకుండా చర్యలు

ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలని సూచనలు

నిజామాబాద్‌,డిసెంబర్‌11  (జనంసాక్షి) :

యాసంగి సీజన్లో రైతులకు ఇబ్బంది కలగకుండా క్షేత్రస్థాయిలో అధికారులు సేవలందించాలని జిల్లా వ్యవసాయాధికారి  అన్నారు. రైతులకు ఎక్కడా ఇబ్బందులు రాకుండా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం రైతాంగానికి పలు రకాల రాయితీలను అందిస్తుందన్నారు. అధిక రసాయనిక ఎరువుల వినియోగం అనారోగ్యానికి హేతువుగా మారిందని అన్నారు. ఈక్రమంలో ప్రత్యామ్నాయ పంటలతో రైతులు లాభాలు గడిరచాలన్నారు. వరికి బదులు పప్పు,నూనె గింజలు వేస్తే ప్రభుత్వం కూడా సహకారం అందిస్తుందని అన్నారు.  పంట దిగుబడికి అధిక డబ్బులను వెచ్చిస్తున్నా రైతులు ఆరోగ్య పరిరక్షణ కోసం రసాయనిక ఎరువుల వినియోగం తగ్గించాలని సూచించారు. పల్లెల్లో సేంద్రియ సేద్యంతో పాడి పంటలు కన్పించాలని అన్నారు. మార్కెట్‌కు వచ్చిన రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. రైతులకు అమ్మకాల సందర్భంగా ఇబ్బందులు కలిగిస్తే తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.   ఎరువులు, పురుగు మందుల దుకాణాదారులకు  అవగాహన కల్పించారు.నిబంధనలను అనుసరించి, నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు విక్రయించాలని వ్యవసాయాధికారి సూచించారు. యాసంగి సాగు ప్రారంభమై పదిరోజులు కావస్తున్నా బ్యాంకుల ద్వారా అందాల్సిన రుణాలు రైతుల చేతికి అందడం లేదు. ఈయేడాది పుష్కలంగా వర్షాలు కురవడంతో యాసంగి సాగుపై రైతులు భారీ ఆశలు పెట్టుకున్నారు. వానకాలంలో జరిగే సాగు అంచనాలతో సమానంగా ఈయేడు యాసంగికి రైతులు సిద్ధమయ్యారు.