వ్యవసాయరంగం బలోపేతం కోసం కృషి

నిజామాబాద్‌,జూన్‌14(జ‌నం సాక్షి): ఖరీఫ్‌ సన్నద్ధత, రైతు బీమా సమగ్ర సర్వేపై అధికారులు సవిూక్ష నిర్వహించారు. విత్తనాలు, ఎరువులు సరిపడా ఉన్నట్లు తెలిపారు. రైతుల బీమాకు అవకాశం కల్పించడం జరిగిందని, ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. రాష్ట్రప్రభుత్వం రైతులకు రెండుపంటలకు ఎకరానికి రూ. 8వేలు అందజేస్తుందని, ఇప్పుడు బీమా కూడా అమలు చేయబోతుంన్నారు. మునుపెన్నడూలేని విధంగా రాష్ట్రప్రభుత్వం రైతులకు ఎకరానికి రెండు పంటలకు రూ. 8వేలను అందజేసిందని అన్నారు. రైతులకు పలు రకాల ప్రయోజనాలు చేకూర్చాలనే సంకల్పంతో ప్రభుత్వం ఎన్నో రకాల కార్యక్రమాలను చేపడుతుందన్నారు. వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకుంటుందన్నారు. ఇదిలావుంటే విత్తన లైసెన్స్‌ కలిగిన సీడ్స్‌ షాపుల్లోనే రైతులు విత్తనాలను కొనుగోలు చేయాలతీ వ్యవసాయాధికారులు హెచ్చరిస్తున్నారు. మోసాలకు అవకాశం లేకుండా అవసరమైతే సాయం తీసుకోవాలన్నారు. విత్తనం కొనుగోలుతోపాటు పక్కా రశీదు తీసుకోవాలని రైతులకు వివరిస్తున్నారు. పంట కాలం పూర్తియ్యే వరకు రశీదును రైతు తన వద్ద భద్రపర్చుకోవాలని సూచిస్తున్నారు.ఏదైన పంట నష్టం జరిగితే సదరు విత్తన కంపెనీపై ప్రభుత్వం చర్యలు తీసుకోని రైతుకు నష్ట పరిహారం ఇప్పించేందుకు అవకాశం సులభమని చెబుతున్నారు. పల్లెల్లోకి వచ్చి మాయమాటలు చెప్పే వారి వద్ద ఎట్టి పరిస్థితుల్లో విత్తనాలను కొనుగోలు చేయొద్దన్నారు.