ప్రభుత్వం చెబుతున్నంతగా సీన్ లేదు
అసెంబ్లీలో ఇచ్చిన హావిూలకే దిక్కు లేదు
విమర్వలను కూడా పాజిటివ్‌గా తీసుకోవాలి
అసెంబ్లీలో బడ్జెట్‌పై చర్చలో అక్బరుద్దీన్
హైదరాబాద్,మార్చి9(జనం సాక్షి): ఆరోగ్యశాఖలో ప్రభుత్వం చెబుతున్నంత పనితీరు లేదని తెలంగాణ ప్రభుత్వంపై అసెంబ్లీలో అక్బరుద్దీన్ ఓవైసీ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా ఒక్క రూపాయి కూడా మూడేళ్ల నుంచి ఇవ్వడం లేదన్నారు. టిమ్స్ హాస్పిటల్ ఘనంగా ఓపెన్ చేసి ఎందుకు మూసివేశారో తెలీదన్నారు. మెడికల్ కాలేజీల అంశంలో ప్రభుత్వం తప్పుడు లెక్కలు చెబుతోందని అక్బరుద్దీన్ ఆరోపించారు. అభినందనలు మాత్రమే కాదు.. విమర్శలను సైతం ప్రభుత్వం సానుకూలంగా తీసుకోవాలన్నారు. ప్రభుత్వం మంచి చేస్తోందని కానీ ఇంకా చేయాల్సి ఉందన్నారు. వచ్చే ప్రభుత్వం టీఆరెస్‌దేనని.. తాము కూడా కలిసి పనిచేస్తామన్నారు. బంగారు తెలంగాణ అభివృద్ధిలో టీఆర్‌ఎస్‌తో ఎంఐఎం కలిసి ముందుకు వెళుతుందని అక్బరుద్దీన్ పేర్కొన్నారు. బడ్జెట్‌పై చర్చను ప్రారంభిస్తూ.. మైనార్టీల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని అక్బరుద్దీన్ ఒవైసీ అన్నారు. ముస్లింల సమస్యల గురించి అసెంబ్లీలో ఒవైసీ మాట్లాడుతూ.. హజ్ హౌస్ పక్కన బిల్డింగులోకి అన్ని మైనారిటీ ఆఫీసులను తరలిస్తామని ప్రభుత్వం హావిూ ఇచ్చిందని.. కానీ ఇప్పటికీ దాన్ని నెరవేర్చలేదన్నారు. ఆ బిల్డింగు నిర్మాణాన్ని పూర్తి చేయలేదని మండిపడ్డారు. ఇస్లామిక్ సెంటర్ కోసం 10 ఎకరాలు కేటాయించారని.. కానీ ఇప్పటికీ కన్ స్టక్షన్ర్ మొదలవ్వలేదన్నారు. ఈ హావిూలన్నీ అసెంబ్లీ సాక్షిగా కేసీఆర్ ఇచ్చారని.. కానీ ఇప్పటికీ అమల్లోకి రాలేదన్నారు. వీటి గురించి చర్చించేందుకు దసరా తర్వాత విూటింగ్ కు పిలుస్తామని కేసీఆర్ అన్నారని కానీ మాట తప్పారని దుయ్యబట్టారు. దసరా, దీపావళి, క్రిస్ మస్, సంక్రాంతి పండుగలు అయిపోయాయని.. హోళీ పండుగ అయిపోయినా వాటి ప్రస్తావన ఉండదన్నారు. హావిూలు నిలబెట్టుకోలేనప్పుడు ఇవ్వడం ఎందుకని ప్రశ్నించారు. అసెంబ్లీలోని వెల్ లోకి దూసుకొచ్చారనే కారణంతో ఎమ్మెల్యేలను సస్పెండ్ చేసి బయటకు పంపుతున్నారు. మరి ఈ సభలో ఇచ్చిన హావిూల సంగతేంటి? వాటికి విలువ లేదా? ఆ హావిూలకు ప్రాముఖ్యత లేదా? అలాంటప్పుడు హావిూలు ఇవ్వడం ఎందుకు? ఇవాళ వేల ఉద్యోగాలు ఇస్తామని ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది. మరి, వీటినైనా భర్తీ చేస్తారో లేదో? పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో ఒక్క ముస్లిం కూడా లేడు. ఒక్క ముస్లిం పబ్లిక్ ప్లీడర్ లేడు. మైనారిటీ కమిషన్ లోనూ వారికి చోటు లేదు. రాష్ట్రంలోని ఇన్ని యూనివర్సిటీల్లో ఒక్క ముస్లిం వైస్ ఛాన్స్‌లర్ అయినా ఉన్నారా? ఈ పోస్టులకు సరిపోయే ముస్లింలు లేరా? వీసీ అయ్యే సత్తా ఉన్న ముస్లిం ఒక్కరూ లేరా? ఇది చాలా బాధాకరం అన్నారు. వక్ఫ్ భూముల కోసం తెలంగాణ ఉద్యమం సమయంలో కోర్టుకు వెళ్లిన టీఆర్‌ఎస్.. రాష్ట్రం ఏర్పడి, అధికారంలోకి వచ్చాక
ఆ భూములు ప్రభుత్వానికి చెందుతాయని అంటోంది. ఇదెక్కడి న్యాయం అని ఒవైసీ ఘాటుగా ప్రశ్నించారు. బడ్జెట్‌లో మైనార్టీలకు కేటాయించిన నిధులపై లెక్క చెప్పాలని డిమాండ్ చేశారు.