చంద్రచూడ్‌కు ఘనంగా వీడ్కోలు

` శుక్రవారం చివరి పనిదినం కావడంతో సీజేఐని సన్మానించిన ధర్మాసనం
న్యూఢల్లీి(జనంసాక్షి):భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ నవంబర్‌ 10న పదవీ విరమణ చేయనున్నారు. ఈ క్రమంలో శుక్రవారం ఆయనకు చివరి పనిదినం కావడంతో సుప్రీం ధర్మాసనం ఘనంగా వీడ్కోలు పలికింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రేపటి నుంచి సర్వోన్నత న్యాయస్థానం నుంచి తీర్పులు ఇవ్వలేనన్న మాట వాస్తవమని.. అయినప్పటికీ తాను వృత్తిపరంగా పూర్తి సంతృప్తిగా ఉన్నానని చెప్పారు. మరోవైపు సుప్రీం కోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా నియమితులలైన సంగతి తెలిసిందే. నవంబర్‌ 11న జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా ప్రమాణస్వీకారం చేయనున్నట్లు కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్‌రామ్‌ మేఘ్వాల్‌ ఇదివరకే వెల్లడిరచారు. 2025 మే 13 వరకు ఆయన సీజేఐగా కొనసాగనున్నారు.భారత ప్రధాన న్యాయమూర్తిగా రెండేళ్ల పాటు సేవలందించిన జస్టిస్‌ డీవే చంద్రచూడ్‌.. అనేక కీలక కేసుల్లో తీర్పులు వెలువరించారు. చివరి రోజు అలీగఢ్‌ ముస్లిం యూనివర్సిటీకి మైనార్టీ హోదా కల్పించే కేసులో తీర్పు వెలువరించిన డీవై చంద్రచూడ్‌ నేతృత్వంలోని ధర్మాసనం.. మైనార్టీ హోదా ఉండాలా?వద్దా అన్న అంశాన్ని తేల్చేందుకు కొత్త బెంచ్‌కు బదిలీ చేస్తున్నట్లు 4:3 మెజార్టీతో తీర్పు వెలువరించింది. ఈ నేపథ్యంలో జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ వెలువరించిన కొన్ని కీలక తీర్పులను పరిశీలిస్తే..రాజకీయ పార్టీలకు నిధులు సమకూర్చేందుకు తీసుకొచ్చిన ఎన్నికల బాండ్ల (వశ్రీవఞబినీతీజీశ్రీ పనీనిటబ బఞష్ట్రవఎవ) చెల్లుబాటు రాజ్యాంగ విరుద్ధమని స్పష్టం చేసింది. ఎన్నికల బాండ్ల జారీని బ్యాంకులు తక్షణమే నిలిపివేయాలని సీజేఐ జస్టిస్‌ డి.వై. చంద్రచూడ్‌ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఏకగ్రీవంగా తీర్పునిచ్చింది.ప్రైవేటు ఆస్తులను ప్రభుత్వాలు స్వాధీనం చేసుకొనే విషయంలో సుప్రీంకోర్టు ఇటీవల చరిత్రాత్మక తీర్పు వెలువరించింది. ప్రైవేటు వ్యక్తుల యాజమాన్యంలోని ఆస్తులన్నీ సమాజ ఉమ్మడి వనరులు కాబోవని.. ప్రజల ఉమ్మడి ప్రయోజనాల కోసం ప్రభుత్వాలు వాటిని ఏకపక్షంగా పంపిణీ చేయజాలవని స్పష్టం చేసింది. అయితే, కొన్నింటిలో మాత్రం మినహాయింపు ఉంటుందని 7:2 మెజారిటీతో వెలువడిన తీర్పులో పేర్కొంది.జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించేలా రాజ్యాంగంలోని ‘ఆర్టికల్‌ 370’ రద్దు రాజ్యాంగబద్ధమేనని సర్వోన్నత న్యాయస్థానం వెల్లడిరచింది. ఈ అంశంపై పిటిషనర్ల వాదనను తోసిపుచ్చిన రాజ్యాంగ ధర్మాసనం.. ఆర్టికల్‌ 370ని రద్దు చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని సమర్థించింది.స్వలింగ సంపర్కుల వివాహాలకు చట్టబద్ధత కల్పించే అంశాన్ని సర్వోన్నత న్యాయస్థానం తోసిపుచ్చుతూ సీజేఐ జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌ నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం నాలుగు వేర్వేరు తీర్పులను ఇచ్చింది. ఒఉఃుఖిఎంG కమ్యూనిటీకి చెందిన వ్యక్తుల వివాహానికి సమానత్వ హక్కులు ఇచ్చేందుకు నిరాకరించినప్పటికీ.. వారు సహజీవనంలో ఉండొచ్చని తెలిపింది. అంతేగాక, స్వలింగ సంపర్క జంటలపై ఎలాంటి వివక్ష చూపించొద్దని, వారి హక్కులను కాపాడాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది.జైళ్లలో ఖైదీల మధ్య కులవివక్ష చూపడం సరికాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఖైదీలతో ఆయా రాష్ట్రాలు ప్రవర్తిస్తున్న తీరుపై అత్యున్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తంచేసింది. కారాగారంలో కులం ఆధారంగా వివక్ష, పని విభజన ఉందంటూ ఆరోపిస్తూ దాఖలైన పిటిషన్‌పై విచారణ చేపట్టిన న్యాయస్థానం..కులవివక్ష చూపడం సరికాదని పేర్కొంది.పౌరసత్వ చట్టం`1955లోని సెక్షన్‌ 6ఎ రాజ్యాంగ బద్ధతను సుప్రీంకోర్టు ధర్మాసనం సమర్థించింది. సీజేఐ డీవై చంద్రచూడ్‌, జస్టిస్‌ సూర్యకాంత్‌, జస్టిస్‌ ఎంఎం సుందరేశ్‌, జస్టిస్‌ జేబీ పార్థీవాలా, జస్టిస్‌ మనోజ్‌మిశ్రాలతో కూడిన ధర్మాసనం 4:1 మెజార్టీతో తీర్పును వెలువరించింది.ఉత్తర్‌ప్రదేశ్‌లో ఏర్పాటైన 16వేలకు పైగా మదర్సా బడులు చట్టబద్ధమేనని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. ఈ పాఠశాలలు లౌకికవాద సూత్రాలకు విరుద్ధంగా ఉన్నాయంటూ అలహాబాద్‌ హైకోర్టు ఇచ్చిన తీర్పును ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌ నేతృత్వంలోని ధర్మాసనం కొట్టివేసింది. దీంతో యూపీలోని మదర్సాలలో చదువుకునే లక్షల మంది విద్యార్థులకు ఊరట లభించింది.

 

తాజావార్తలు