నేటి నుంచి బీసీ కులగణన ` ఇంటింటా సర్వే
హైదరాబాద్(జనంసాక్షి): తెలంగాణ అసెంబ్లీలో బీసీ కులగణన 9వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. నేటినుంచి ఇంటింటి సర్వే ద్వారా వివరాలు సేకరిస్తారు. దీనిపై మాట్లాడిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఎన్నికల్లో ఇచ్చిన హావిూ ప్రకారం.. కుల గణన చేస్తున్నామని చెప్పారు. ప్రతి ఇంటిని, కులాన్ని సర్వే చేసి.. ప్రజల ఆర్థిక స్థితి గతులు తెలుసుకుంటామని అన్నారు. సర్వేలో అన్ని వివరాలు పొందు పరుస్తామని.. సర్వ రోగ నివారిణిలా సర్వే ఉంటుందని పేర్కొన్నారు. దేశంలోని సంపద, రాజ్యాధికారం జనాభా దామాషా ప్రకారం దక్కాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. అందు కోసమే ఎన్నికల్లో హావిూ ఇచ్చి అధికారంలోకి రాగానే కుల గణన చేస్తామని చెప్పాం. రాష్ట్రవ్యాప్తంగా కులగణనతో పాటు సోషల్, ఎకానమిక్, ఎడ్యుకేషన్, పొలిటికల్, ఎంఎª`లాయిమెంట్ అంశాలపై సర్వే చేస్తాం. రాష్ట్రంలో ఉన్న ప్రతి ఇంటిని, అన్ని కులాలు, ఆర్ధిక స్థితిగతలపై సర్వే నిర్వహిస్తాం. ఈ సర్వే ద్వారా సంపదను అన్ని వర్గాలకు జనాభా దమాషా ప్రకారం ఎలా పంచాలన్న దానిపై ప్రణాళికలు తయారు చేస్తాం. సామాజిక ఆర్ధిక రాజకీయ మార్పునకు పునాదిగా తెలంగాణ మారబోతుందని భట్టి తెలిపారు.