కేసీఆర్‌ పేరు చెరిపివేయలేం

` స్వరాష్ట్రం కోసం పదవులను వదిలేసిన ఘనత ఆయనది
` కేసులకు  భయపడకండి..పార్టీ అండగా ఉంటుంది : కేటీఆర్‌
హైదరాబాద్‌(జనంసాక్షి): పదవుల కోసం రేవంత్‌రెడ్డి పరితపిస్తున్నప్పుడు కేసీఆర్‌ ఉన్న పదవే వదిలేశారని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ అన్నారు. ఈమేరకు ఆయన ‘ఎక్స్‌’ వేదికగా పోస్టు చేశారు.’’ఉద్యమకారులపై గన్ను ఎక్కు పెట్టినప్పుడు కేసీఆర్‌ ప్రాణాన్నే ఫణంగా పెట్టారు. తెలంగాణను చంపేందుకు రేవంత్‌ బ్యాగులు మోసిన సమయంలో.. ఆయన రాష్ట్ర భవిష్యత్తుకు ఊపిరి పోశారు. కేసీఆర్‌ అంటేనే తెలంగాణ చరిత్ర.. విూరా ఆయన పేరును తుడిచేది?’’ అని కేటీఆర్‌ పేర్కొన్నారు.మూసీపై ముందుకు.. కొనుగోళ్లపై వెనక్కు అని కేటీఆర్‌ విమర్శించారు. ‘’రామన్నపేటకు రైరై.. కొనుగోలు సెంటర్లకు నైనై. దామగుండం ధనాధన్‌.. ధాన్యం కొనుగోళ్లు డాండాం. కొనుగోళ్లకు దిక్కులేదు.. కాంగ్రెస్‌ కోతలకు లెక్కలేదు. దళారులకు దండిగా.. రైతన్నలకు దండగా. ఎద్దేడ్చిన వ్యవసాయం.. రైతు ఏడ్చిన రాజ్యం ఎప్పుడూ బాగుపడదు’’ అని ‘ఎక్స్‌’లో పోస్టు చేశారు.
కేసులకు  భయపడకండి
పార్టీ అండగా ఉంటుందన్న కెటిఆర్‌
మహబూబ్‌నగర్‌,అక్టోబర్‌30(ఆర్‌ఎన్‌ఎ): కాంగ్రెస్‌ వైఫల్యాలపై ప్రజల తరఫున నిరంతరం పోరాడాలని కెటిఆర్‌ పిలుపునిచ్చారు. ఎన్ని కేసులు పెట్టినా బీఆర్‌ఎస్‌ పార్టీ అన్ని వేళలా అండగా ఉంటుందన్నారు.  కాంగ్రెస్‌ పార్టీకి వ్యతిరేకంగా సోషల్‌ విూడియాలో పోస్టులు పెడుతున్నాడని బీఆర్‌ఎస్‌ సోషల్‌ విూడియా విభాగం కన్వీనర్‌ వరదా భాస్కర్‌ ముదిరాజ్‌ను పోలీస్‌ స్టేషన్‌కు పిలిపించి వన్‌ టౌన్‌ సీఐ చితకబాదారు. విషయం తెలుసుకున్న బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ భాస్కర్‌కు ఫోన్‌ చేసి ధైర్యం చెప్పారు. అంతకు ముందు మాజీ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌, మాజీ కార్పొరేషన్‌ చైర్మన్లు ఆంజనేయ గౌడ్‌ ప్లలె రవికుమార్‌ తదితరులు పోలీస్‌ స్టేషన్‌లో బైఠాయించి నిరసన తెలిపారు. సీఐ క్షమాపణ చెప్పడంతో నిరసన విరమించారు. అనంతరం జైల్లో ఉన్న బీఆర్‌ఎస్‌ నేత శ్రీకాంత్‌ గౌడ్‌ను కలిసి పరామర్శించారు.