తూప్రాన్ మున్సిపల్ చైర్మన్ అవినీతికి పై ముఖ్యమంత్రికి మంత్రి చర్యలు తీసుకోవాలి

*తూప్రాన్ మున్సిపల్ వైస్ చైర్మన్ శ్రీనివాస్ తూప్రాన్ జనం సాక్షి నవంబర్ 15:: తూప్రాన్ మున్సిపల్ చైర్మన్ అధికార పార్టీకి వ్యతిరేకంగా ప్రజావ్యతిరేకంగా అవినీతి అక్రమాలకు పాల్పడుతూ ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నందున అతనిపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రికి మంత్రి హరీష్ రావుకు ఫిర్యాదు చేయనున్నట్లు తూప్రాన్ మున్సిపల్ వైస్ చైర్మన్ శ్రీనివాస్ పేర్కొన్నారు ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కొన్ని వార్డులకు మినహా మిగతా వార్డులకు నిధులు కేటాయించడం లేదని ఏ వార్డుకు ఎన్ని నిధులు కేటాయించిన వివరాలను బహిరంగపరచాలని ఆయన డిమాండ్ చేశారు ముఖ్యమంత్రి నియోజకవర్గం లో మున్సిపల్ చైర్మన్ హిస్టారీతిన వ్యవహరించడం మంత్రి దృష్టికి తీసుకెళ్తామని అన్నారు తూప్రాన్ మెయిన్ రోడ్డు వెడల్పులు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిలు 40 ఫీట్లు వెడల్పు చేయాలని బహిరంగంగా చెప్పారని అందుకు విరుద్ధంగా నీవు 50 ఫీట్ల రోడ్డు వెడల్పు చేశారని ఆయన అన్నారు తూప్రాన్ పట్టణ అభివృద్ధిలో గతంలో మంజూరైన పనులు ఇప్పుడు పూర్తయ్యాయని పూర్తయ్యాక తాను చేశానని చెప్పుకోవడం ఎంతవరకు సమంజసం అన్నారు. గతంలో గ్రామపంచాయతీ ఉన్నప్పుడు మున్సిపల్ భవనము వంత పడకల ఆసుపత్రి గెస్ట్ హౌస్ సమీకృత మార్కెట్ 500 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు వి సైడు మార్కెట్ వంటి భవనాలు మంజూరు అయ్యాయని అన్నారు తూప్రాన్ మున్సిపల్ పట్టణానికి ఇతర మండలాల నాయకులు రావద్దనడం మున్సిపల్ సమావేశంలో ఆయన ఇష్టమున్న పనులను తీర్మానం చేయడం తాము వ్యతిరేకిస్తే సస్పెండ్ చేస్తానని బెదిరింపువంటి కార్యక్రమాలకు పాల్పడుతున్నాడని అన్నారు ఆయన చేసిన ఆ ఇంటి అక్రమాలపై బుక్కులు ఎటును ముఖ్యమంత్రికి పై అధికారులకు మున్సిపల్ శాఖ మంత్రికి ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు నిర్ణయాల వల్ల తూప్రాన్ పట్టణంలో టిఆర్ఎస్ పార్టీకి తీవ్ర నష్టం జరుగుతుందని మంత్రి హరీష్ రావు వెంటనే పార్టీని ఏకపక్షంగా నడిపించడానికి చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు విలేకరుల సమావేశంలో మాజీ ఎంపీపీ గుమ్మడి శ్రీనివాస్ మాజీ సర్పంచ్ శివమ్మ పట్టణ టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు సతీష్ కౌన్సిలర్ రఘుపతి కృష్ణ రవీందర్ రెడ్డి నాయకులు చంద్ర రెడ్డి ప్రభాకర్ రెడ్డి ఉమర్ తదితరులు పాల్గొన్నారు