దేశంలో ఒక గొప్ప హాస్పిటల్‌గా నిమ్స్
– వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్.
హైదరాబాద్,అక్టోబరు 2(జనంసాక్షి):నిమ్స్‌లో సెంటర్ ఫర్ స్టెమ్ సెల్ అండ్ రీజెనరేటివ్ మెడిసిన్ విభాగం ఏర్పాటుచేయడం ద్వారా దేశంలో ఒక గొప్ప హాస్పిటల్‌గా నిమ్స్ ఎదిగిందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్. అన్నారు. నిమ్స్‌లో సెంటర్ ఫర్ స్టెమ్ సెల్ అండ్ రీజెనరేటివ్ మెడిసిన్ విభాగాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ కార్య్కమంలో నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ మనోహర్, సూపరింటెండెంట్ డా సత్యనారాయణ. పలువురు నిమ్స్ డాక్టర్స్, సిబ్బంది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఈ విభాగం ఏర్పాటుచేయడం ద్వారా దేశంలో ఒక గొప్ప హాస్పిటల్ గా నిమ్స్ ఎదిగింది అని అన్నారు. గతంలో ఇలాంటి పరీక్షలు చేయడానికి శాంపిల్స్ ఢిల్లీ కి పంపించాల్సివచ్చేది అని ఇప్పుడు ఆ అవసరం లేదు అని మంత్రి అన్నారు. రోజుకి పది వేల పరీక్షలు చేయగల సత్తా ఇప్పుడు నిమ్స్ కు ఉంది. బ్లడ్ కాన్సర్ ఉన్న వారికి అత్యున్నత ప్రమాణాలతో కూడిన స్టెమ్ సెల్ ట్రీట్మెంట్ విభాగాన్ని ఈ రోజు ఏర్పాటు చేసుకున్నాం. దీనివల్ల రక్త కాన్సర్ తో బాద పడుతున్న పేదవారికి ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా చికిత్స అందిచానున్నాం. ఇప్పటికే కిడ్నీ, గుండె మార్పిడి లో, స్టెమ్ సెల్ థెరపీ లో ఎక్కువ రిసల్ట్ ఎక్కువ ఉన్న హాస్పిటల్ నిమ్స్. కోవిడ్ వల్ల కొన్ని సర్వీసులు నిలిపివేశాం. మళ్ళీ వారం రోజుల్లో ఈ సేవలు అన్నీ ప్రారబిస్తాము. ఈ రోజు స్టెమ్ సెల్, మొలిక్యులయర్ లాబ్ ను ప్రజలకు అంకితం చేశామని మంత్రి ప్రకటించారు. ఎఅఓఖీ లెక్కల ప్రకారం మన రాష్ట్రం లో 40 లక్షల మందికి యాంటీ బాడీస్ అభివృద్ది చెందాయి. కరోనా విషయంలో తెలంగాణ రాష్ట్రం మొదటినుండి ఏం చెప్పిందో, ఏం చేసిందో అదే కరెక్ట్ అని ఇప్పుడు తేలిపోయింది. ప్లాస్మా తెరపీల పేరిట, తోసలీజుమాబ్ ఇంజెక్షన్ల పేరిట దోపిడీ చేయడం తప్ప మనిషిని బ్రతికించలేము అని చెప్పాము అదే నిజం అయ్యింది. 10 వేల రూపాయలు పెడితే మామూలు లక్షణాలు ఉన్న వారికి నయం చేయవచ్చు అని చెప్పినం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చెప్పినవన్నీ నిజం అయ్యాయి. కొద్ది రోజుల్లో డెంగీ, వైరల్ ఫేవర్స్, మామూలు వైరల్ ఫీవర్స్, ఊ1 ఔ1, మలేరియాతో ఎలా సహజీవనం చేసినమో అలానే సహజీవనం చేయాల్సివస్తుంది. కరోనా కి చంపగలిగే శక్తి లేదు కానీ కొంత అప్రమత్తంగా లేకపోతే ప్రమాదం పొంచి ఉంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం టెస్ట్ ల పేరిట ప్రతి ఇంటిని తాకింది. ఎక్కడిక్కడ పరీక్షలు చేయడం, మందుల కిట్స్ ఇవ్వడం, ¬మ్ ఐసోలేషన్ లో, ప్రభుత్వ ఐసోలేషన్ లో పెట్టడం, ఖఊఅ, సెకండరీ, టెర్శరీ కేంద్రాలలో చికిత్స అందించడం చేశాము. వీటి ద్వారా పూర్తి స్థాయి లో కరోనాను అదుపులో ఉంచగలిగినం. రాబోయే కాలంలో ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటూనే నిమ్స్ లో ఓపి సేవలు మొదలు పెడతాం. అయితే ఎమర్జెన్సీ లో అబులెన్స్ లో వచ్చిన వారికి కొంత ఇబ్బందులు వస్తున్నాయి. వాటిని కూడా అతి త్వరలో దీనిని అధిగమిస్తాం. సిఎం గారు ఓపి సేవలు పెంచమని గతంలో ఆదేశించారు. అందుకోసం 250 కోట్లతో ఓపి బ్లాక్, క్రిటికల్ కేర్ యూనిట్ మొదలు పెడుతున్నాం. త్వరలో సిఎం గారి చేతుల విూదుగా శంకుస్థాపన చేస్తాం. ఇప్పుడు 2500 మందికి ఓపి సేవలు అందుతున్నాయి భవిష్యత్తులో 5 వేల మందికి సేవలు అందిచేలా చూస్తాం. హైదరాబాద్ చుట్టూ నాలుగు పెద్ద ఆసుపత్రులు కట్టాలని సిఎం గారి ఆలోచన అందుకు అనుగుణంగా బీబీ నగర్ ఎయిమ్స్ వచ్చింది, గచ్చిబౌలీ లో ుఎఓూ వచ్చింది. ఇక షావిూర్పేట ?మేడ్చల్ వైపు ఒకటి, కొంగరకలాన్ వైపు ఒక హాస్పిటల్ పెట్టబోతున్నాం. కోవిడ్ వచ్చిన తరువాత వైద్య రంగం లో మన స్థానం ఏంటో తెలిసపోయింది, ఈ శాఖను ను మరింత బలోపేతం చేయాలని సిఎం గారు ఇప్పటికే చెప్పిఉన్నారు. తప్పకుండా మరింత బలోపేతం చేస్తాం. వైద్యం కి డబ్బులు లేక శవాలుగా మారే పరిస్థితి రాకుండా చేయడమే ప్రభుత్వ లక్ష్యం అని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు.