ఆ పోస్టులు చూసి సూసైడ్ చేసుకునేదాన్ని: హోంమంత్రి అనిత

 సోషల్ మీడియాలో తనపై ట్రోలింగ్ చూసి ఎంతో బాధపడేదాన్నని హోంమంత్రి అనిత అన్నారు. ‘కానీ నేను గట్టిదాన్ని. అందుకే చలించలేదు. బలహీన క్షణంలో కఠినమైన నిర్ణయం తీసుకోలేదు. లేదంటే ఆ పోస్టులు చూసి సూసైడ్ చేసుకునేదాన్ని. మానసికంగా బలహీనంగా ఉంటే అంతే సంగతులు. ఆత్మహత్యే శరణ్యం. సోషల్ మీడియాలో కొందరు ఉగ్రవాదుల కంటే దారుణంగా ప్రవర్తిస్తున్నారు. అలాంటి వారిని ఊరికే వదిలే ప్రసక్తే లేదు’ అని స్పష్టం చేశారు.