హామీలు ఎందుకు అమలు చేయడంలేదు

` శ్వేతపత్రం విడుదల చేయండి
` కూనంనేని డిమాండ్‌
` బిజెపి, బిఆర్‌ఎస్‌లు శాంతిభద్రతల సమస్య సృష్టించే యత్నం చేస్తున్నాయని ఆగ్రహం
హైదరాబాద్‌(జనంసాక్షి):కాంగ్రెస్‌ ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. కాంగ్రెస్‌ ఇచ్చిన హావిూలు అమలు చేయలేకపోతోందని… ఎందుకు నెరవేర్చలేక పోతున్నామో ఆ పార్టీ ఆలోచించుకోవాలని అన్నారు. ªూవిూల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని.. శ్వేతపత్రం విడుదల చేయాలని అన్నారు. హైడ్రా..పెద్దవాళ్ళ గుండెల్లో బాంబ్‌ కావాలని..పేదల గుండెల్లో కాదని అన్నారు.మూసీ పునర్జీవ పథకం విషయంలో ప్రభుత్వానికి స్పష్టత లేదని సీపీఐ భావిస్తుందని అన్నారు.బీజేపీ, బీఆర్‌ఎస్‌ పార్టీలు చీకటి ఒప్పందం కుదుర్చుకున్నాయని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు బీజేపీ, బీఆర్‌ఎస్‌ పార్టీలపై ఘాటైన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో పరిస్థితులు గందరగోళంగా తయారు కావడానికి పదేళ్ల బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ విధానాలే కారణమని అన్నారు. శాంతి భద్రత సమస్యలు సృష్టించడానికి బీఆర్‌ఎస్‌, బీజేపీ ప్రయత్నాలు చేస్తున్నాయని మండిపడ్డారు కూనంనేని.

తాజావార్తలు