పేరు స్మశానం దారి రియల్ స్టేట్ కు

రియల్ ఎస్టేట్ వ్యాపారుల నిర్వాకం
తూప్రాన్  జనం సాక్షి నవంబర్ 11::  పేరుకు స్మశాన వాటికకు వేసింది అనుకూలంగా రియల్ ఎస్టేట్ వెంచర్ కు సిమెంట్ రోడ్డు రాజకీయ అండ దండలతో వేశారు  తూప్రాన్ మున్సిపల్ పరిధిలో గల కరీంగూడా సమీప ప్రాంతం జాతీయ రహదారికి దగ్గరగా ఉన్నందున రియాల్టర్  ప్రజాప్రతినిధుల అధికారుల అండదండలతో సంబంధిత భూమి రైతులను మభ్యపెడుతూ ప్రలోభాలకు గురి చేస్తూ లావాని భూముల్లో నుండి  వైకుంఠధామం పేరిట 40 ఫీట్ల రోడ్డును తీసి కొద్ది నెలలు ఆలస్యం చేసి ఎవరి నుండి ఎలాంటి ఒత్తిడి లేకపోవడంతో సిమెంట్ రోడ్డును సంబంధిత ప్రజా ప్రతినిధి అండదండలతో వైకుంఠధామానికి దారి అనే పేరుతో సిమెంటు రోడ్డు  నిర్మాణ పనులు చేసేశారు  అంతర్గతంగా భూమిని కొనుగోలు చేసిన రియాల్టర్లు వెంచర్ కు ప్రభుత్వ భూమిలో రోడ్డు నిర్మాణం పనులు చేపట్టారు. ఇదివరకే వైకుంఠ ధామానికి రోడ్డు ఉన్నందున మరి ఇదేమిటి అని కొందరు వ్యవసాయదారులు గుసగుసలు చెప్పుకోవడం శోచనీయం. గోల్డెన్ దాబా వెనుక భాగంలో కరీం గూడా వైకుంఠధామం పేరిట 40 ఫీట్ల రోడ్డును రియాల్టర్లు కొనుగోలు చేసిన భూమి వరకు  వేసుకునే యోచనలో ఉన్నట్లు సమీప రైతుల సమాచారం. కొనుగోలు చేసిన భూమి జాతీయ రహదారికి దగ్గరగా ఉన్నందున ఏర్పాటుచేసిన వెంచర్ లో ప్లాట్లు చేసి అధిక మొత్తంలో దండుకోవచ్చు అన్న దూర ఆలోచనతో ఇలాంటి దుస్సహాసం చేసారని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు, కబ్జాలో ఉన్న రైతులకు అయాన భయాన మాయ మాటలు డబ్బులతో ఆశలు చూపించిరోడ్డు వేసినట్లయితే మీ పేరట ఉన్న భూమికి పెద్ద మొత్తంలో లాభం చేకూరుతుందని రైతుల నుండి  ప్రభుత్వ భూమిని తీసుకొని తీర్మానం పేరిట మభ్యపెడుతున్నారు. ముఖ్యంగా గజ్వేల్ నియోజకవర్గం  కెసిఆర్ ఇలాక అయిన తూప్రాన్ లో పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న వెంచర్లు వెలుస్తున్నాయి అధికారులు ప్రజాప్రతినిధులు అండదండ్రులతో ప్రభుత్వాలు అను మతులు లేకున్నా రియల్ మాఫియా ఇష్టమున్నట్లు భూములు కొనుగోలు చేసి ప్లాట్లు చేసి విక్రయిస్తున్నారు రాష్ట్ర రాజధానికి అతి సమీపంలో తూప్రాన్ ఉండడంతో తూప్రాల్లో భూముల ధరలు రియాక్టర్ల పుణ్యమా అంటూ ఆకాశం అంటాయి చిన్న చిన్న చెరువులు కుంటలు  ఉన్నప్పటికీ సంబంధిత అధికారుల అండదండగా సహకారంతో వెంచర్లు వెలుస్తున్నాయి. తూప్రాన్ మున్సిపల్ కావడంతో ప్రభుత్వ భూములను సైతం కొల్లగొడుతున్నారు. ఇకనైనా అధికారులు పట్టించుకోని భూముల పై విచారణ చేపట్టి నోటీసులు జారీ చేయాలని ప్రజలు విశ్వాసనీయ వర్గాలు కోరుతున్నారు