ఆరుతడి పంటలకు ప్రాధాన్యం

నిజామాబాద్‌,నవంబర్‌30(జ‌నంసాక్షి): చెరువులు, కుంటల్లో సమృద్ధిగా నీరున్నందున రైతులు పూర్తిగా వరిసాగుకే మొగ్గు చూపుతున్నారని జిల్లా వ్యవసాయాధికారి అన్నారు. అయితే నీటిని పొదుపుగా వాడుకోవాలని సూచించారు. రైతులు ఆరుతడి పంటలను సాగు చేయాలని తెలిపారు. రబీ సీజన్‌లో రైతులకు అన్నిరకాల విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉంచామన్నారు. జిల్లాలో ఎరువులు, విత్తనాలకు కొరత రాకుండా పూర్తిస్థాయిలో అందుబాటులో ఉంచామని తెలిపారు. రైతులకు వరి, మొక్కజొన్న, కందిపంటల యాజమాన్య పద్ధతుల గురించి అవగాహన కల్పించారు.