ఉమ్మడి కరీంనగర్‌,వరంగల్‌ జిల్లాలకు పెరిగిన ప్రాతినిధ్యం

సమతూకంతో అన్ని జిల్లాలకు స్థానం కల్పిస్తూ త్రివర్గం కూర్పు
వెలమ,బిసి సామాజిక వర్గాలకు నాలుగేసి పదవులు
హైదరాబాద్‌,సెప్టెంబర్‌9 (జనం సాక్షి ) :  కేసీఆర్‌ మంత్రివర్గ విస్తరణలో సామాజిక సమతూకాన్ని పాటించారు. అలాగే రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు, వర్గాలకు ప్రాతినిధ్యం లభించేలా సీఎం క్యాబినెట్‌ సమకూర్చారు. తన కుటుంబం నుంచి ముగ్గురికి ప్రాతినిధ్యం దక్కగా తమసామాజిక వర్గానికి మొత్తం నాలుగు పదవులు దక్కాయి. ఎర్రబెల్లి దయాకర్రావుతో కలిపి మొత్తం నాలుగు పదవులు వెలమ సామాజికవర్గానికి దక్కాయి.  ఉమ్మడి పది జిల్లాలకూ చోటు కల్పించడంతో పాటు బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు, ఓసీలకు ప్రాతినిధ్యం లభించేలా చూశారు. బీసీ సామాజిక వర్గాలకు చెందిన ఈటల రాజేందర్‌, తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, శ్రీనివాస్‌గౌడ్‌లకు ఇప్పటికే మంత్రివర్గంలో చోటుకల్పించిన సీఎం కేసీఆర్‌.. తాజాగా అదే సామాజిక వర్గానికి చెందిన గంగుల కమలాకర్‌ను మంత్రివర్గంలోకి తీసుకున్నారు. దీంతో వారి సంఖ్య కూడా నాలుగుకు పెరిగింది. ఎస్టీ సామాజికవర్గం నుంచి లంబాడీ తెగకు చెందిన సత్యవతి రాథోడ్‌కు స్థానం కల్పించారు. అలాగే ఏకంగా ఇద్దరు మహిళలకు మంత్రివర్గంలో స్థానమిచ్చారు. ఇక రాష్ట్రంలోని అన్ని ఉమ్మడి జిల్లాలకూ క్యాబినెట్‌లో ప్రాతినిధ్యం లభించింది. తొలిదశలో ప్రాతినిధ్యం లేని ఖమ్మం జిల్లా నుంచి
ఈసారి పువ్వాడ అజయ్‌కుమార్‌కు చోటు లభించింది. తుమ్మలకు స్థానం దక్కకపోవడంతో అదే సామాజికవర్గానికి చెందిన  పువ్వాడ అజయ్‌ జిల్లాకు పెద్దదిక్కుగా అవతరించనున్నారు. సీఎం కేసీఆర్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న ఉమ్మడి మెదక్‌ జిల్లా నుంచి తన్నీరు హరీశ్‌రావుకు తాజాగా మరోసారి అవకాశ మిచ్చారు. కొత్త జిల్లాల ప్రాతిపదికన చూస్తే దాదాపుగా అన్ని జిల్లాలకు మంత్రి పదవులు లేదా మంత్రి ¬దా ఉన్న చీఫ్‌ విప్‌, విప్‌ పదవులు దక్కాయి. అటు మంత్రివర్గంలో అత్యధికులు ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లాగా ఉమ్మడి కరీంనగర్‌ చోటు దక్కించుకుంది. ఇప్పటికే ఈటల రాజేందర్‌, కొప్పుల ఈశ్వర్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ జిల్లా నుంచి తాజాగా కేటీఆర్‌, గంగుల కమలాకర్‌కు స్థానం కల్పించారు. ఆ తరవాతి స్థానంలో రెండు చీఫ్‌విప్‌లు, రెండు మంత్రులతో ఉమ్మడి వరంగల్‌ జిల్లా ముందున్నది. ఇక హైదరాబాద్‌, రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌, వరంగల్‌ జిల్లాల నుంచి ఇద్దరికి చోటు దక్కింది. అసెంబ్లీలో ఇచ్చిన హావిూ మేరకు సీఎం కేసీఆర్‌ మంత్రివర్గంలో ఇద్దరు మహిళలకు చోటు కల్పించి తన మాట నిలబెట్టుకున్నారు. మంత్రివర్గంలో కనీసం ఒక్క మహిళకైనా చోటు కల్పించాలని గత అసెంబ్లీ సమావేశాల సందర్భంగా పలువురు సభ్యులు కోరగా.. ఒకరు కాదు ఇద్దరు మహిళలకు మంత్రి పదవి ఇస్తామని సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. ఈ మేరకు ఆదివారం జరిగిన మంత్రివర్గ విస్తరణలో సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్‌లకు అవకాశమిచ్చారు. మొత్తం 17 మందితో కూడిన రాష్ట్ర మంత్రివర్గంలో ఇద్దరు శాసనమండలి సభ్యులున్నారు. వీరిలో ¬ంశాఖ మంత్రిగా ఉన్న మహమూద్‌అలీ రెండోసారి ఎమ్మెల్సీగా ఎన్నికవగా.. తాజాగా చోటు దక్కించుకున్న సత్యవతి రాథోడ్‌ ఇటీవల ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. మంత్రులతో పాటు అదే ¬దా చీఫ్‌ విప్‌, విప్‌లను కలిపి చూస్తే రాష్ట్రంలోని అన్ని ప్రధాన సామాజికవర్గాలకు క్యాబినెట్‌లో చోటు లభించింది. బీసీల్లో బలమైన సామాజికవర్గానికి చెందిన గంప గోవర్ధన్‌కు, ఎస్టీల్లో కోయ సామాజిక వర్గానికి చెందిన రేగా కాంతారావుకు, ఎస్సీ సామాజికవర్గానికి చెందిన బాల్క సుమన్‌, గువ్వల బాలరాజులకు విప్‌లుగా స్థానం దక్కింది. మొత్తంగా అనిన జిల్లాలకు,అన్‌ఇన సామాజిక వర్గాలకు ప్రాతినిధ్యం దక్కింది. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా తరవాత ఉమ్మడి వరంగల్‌ జిల్లాకు పెద్ద ఎత్తున ప్రాతినిధ్యం పెరిగింది. శాసనసభ, శాశాసన మండలిలో చీఫ్‌విప్‌లుగా వినయ్‌ భాస్కర్‌, బోడకుంటి వెంకటేశ్వర్లు ఉన్నారు. మంత్రులుగా ఎర్రబెల్లి దయాకర్రావు, సత్యవతి రాథోడ్‌లు ఉన్నారు.