ఘనంగా పిఆర్టియు ఆవిర్భావ దినోత్సవం

డోర్నకల్ ఫిబ్రవరి 9 (జనం సాక్షి)

ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి పిఆర్టియు గత 51 సంవత్సరాలుగా అలుపెరుగని పోరాటం నిర్వహిస్తుందని పిఆర్టియు మండలాధ్యక్షులు వెంపటి సీతారాములు అన్నారు.బుధవారం మండల విద్యా వనరుల కేంద్రం ఆవరణంలో ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా పతాకాన్ని ఆవిష్కరించారు.తొలుత పిఆర్టియు సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు స్వర్గీయ సామల యాదగిరి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో పిఆర్టియు కీలక భూమిక పోషించిందన్నారు.ఉపాధ్యాయుల సమస్యల సాధన కేవలం పిఆర్టియుతోనే సాధ్యమవుతుందన్నారు.రాబోయే రోజుల్లో సంఘాన్ని మరింత పటిష్ట పరిచి ఉపాధ్యాయుల సమస్యల సాధనకు ముందుండి పోరాడుతుందని అన్నారు.ఉపాధ్యాయులకు పదోన్నతి కల్పించి, బదిలీలు చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరారు. మిగిలిన రెండు డిఎలు వెంటనే ప్రకటించాలని డిమాండ్ చేశారు.పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించాలని అన్నారు.కార్యక్రమంలో జనరల్ సెక్రెటరీ డిఎస్ వినోద్ కుమార్,రాష్ట్ర బాధ్యులు సిహెచ్ శ్రీధర్,కృష్ణారెడ్డి,నాగేశ్వరరావు,రమేష్ బాలాజీ,ప్రభుదాస్,రోజ్లిన్,శేష దీపిక,అరుణ భాయ్,
సునీల్,రమేష్,సంజీవరావు,ఆర్వి,బద్రి పేరయ్య,నరేందర్,ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు