ప్రజలకోసం ఎన్నిసార్లైనా ఢిల్లీ వెళ్తా
కేంద్రం నుంచి రావాల్సిన ప్రతి పైసా తెచ్చుకోవడానికి గట్టి ప్రయత్నాలు చేస్తున్నామని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు. ఈ విషయంలో భేషజాలకు పోకుండా తానే స్వయంగా పలుమార్లు ఢల్లీి వెళ్లానని తెలిపారు. దీనిపైనా కొందరు విమర్శలు చేస్తున్నారని, హకుల సాధన కోసం ఎన్నిసారెల్లునా ఢల్లీికి వెళ్తానని చెప్పారు. నాంపల్లి పబ్లిక్‌గార్డెన్స్‌లో మంగళవారం నిర్వహించిన ప్రజాపాలన వేడుకల్లో పా ల్గొని జాతీయ పతాకావిష్కరణ చేశారు.అనంతరం సీఎం మాట్లాడుతూ.. రాష్ట్రంలోని నాలుగు కోట్ల మంది ప్రజల ఆకాంక్ష, ఆలోచన మేరకే సెప్టెంబర్ 17ను ప్రజాపాలన దినోత్సవంగా నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. తెలంగాణ అంటేనే త్యాగమ ని, ఆ త్యాగాలకు ఆద్యుడు దొడ్డి కొముర య్య అని పేర్కొన్నారు. సాయుధ పోరాటంలో ప్రాణ త్యాగాలు చేసిన వారందరికీ ఘన నివాళి అర్పించారు. సెప్టెంబర్ 17ను కొందరు విలీన దినోత్సవమని, కొందరు విమోచన దినోత్సవమని సంబోధిస్తున్నారని.. తాము ప్రజా కోణాన్ని జోడిస్తూ ‘ప్రజా పాలన దినోత్సవం’గా నామకర ణం చేశామని చెప్పారు.తెలంగాణ పునరుజ్జీవనం దిశగా..తెలంగాణ పునరుజ్జీవనం దిశగా తమ ప్రభుత్వం అడుగులు వేస్తున్నదని సీఎం రే వంత్ చెప్పారు. డిసెంబర్ 9న తెలంగాణ తల్లి విగ్రహావిషరణ జరపబోతున్నామని తెలిపారు. రాష్ట్రాన్ని ప్రపంచ వేదికపై ‘ఫ్యూచర్ స్టేట్’గా బ్రాండ్ చేస్తున్నామని, పెట్టుబడుల ఆకర్షణలో ఇదొక వ్యూహాత్మక ప్రయత్నమని చెప్పారు. ఒకప్పుడు లేక్ సిటీగా పేరుపొందిన హైదరాబాద్ ఫ్లడ్స్ సి టీగా దిగజారిందని, దాని ప్రక్షాళన కోసమే హైడ్రా ఏర్పాటు చేశామని తెలిపారు. హైడ్రా వెనుక రాజకీయ కోణం, స్వార్థం లేవన్నారు. ఎన్ని అడ్డంకులు వచ్చినా హై డ్రా ఆగదని స్పష్టం చేశారు. ఈ ఏడాది 4.50 లక్షల ఇండ్లు నిర్మిస్తామని చెప్పారు. సీఎస్ శాంతికుమారి, మంత్రులు, ఎమ్మెల్యేలు, తదితరులు పాల్గొన్నారు.