స్వదేశీ చిప్ తయారీ మా కల
` ఆ దిశగా మార్చేందుకు చేయాల్సిదంతా చేస్తాం.
` ప్రధాని మోదీ
దిల్లీ(జనంసాక్షి): ప్రపంచ వ్యాప్తంగా ప్రతి పరికరంలో ఇండియన్ మేడ్ చిప్ ఉండాలనేది తమ కల అని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. భారత్‌లో చిప్‌లకు ఎప్పుడూ కొరత రాదని భరోసా ఇచ్చారు. దిల్లీలో ‘సెమికాన్ 2024 కాన్ఫరెన్స్’లో సెమికండక్టర్ల రంగానికి చెందిన కంపెనీల ప్రతినిధులు నిపుణులను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. దేశంలో పెట్టుబడులు పెట్టాలని ఈ సందర్భంగా వారిని కోరారు. ’’ప్రపంచంలో ప్రతి పరికరంలో భారత్‌లో తయారైన చిప్ ఉండాలన్నది మా కల. భారత్‌ను సెవిూ కండక్టర్ పవర్‌హౌస్‌కు మార్చేందుకు చేయాల్సిదంతా చేస్తాం. దేశంలో ప్రస్తుతం త్రీ డైమెన్షనల్ పవర్ ఉంది. ఆ మూడు.. సంస్కరణలకు అనుకూల ప్రభుత్వం, తయారీ రంగానికి అనుకూలమైన వాతావరణం, ఆశావహ మార్కెట్. టెక్నాలజీ రుచి ఏంటో తెలిసిన ఇలాంటి మార్కెట్ మరో చోట దొరకడం కష్టం’’ అని భారత్‌లో వృద్ధికి అనుకూలంగా ఉన్న వాతావరణం గురించి మోదీ వారికి వెల్లడిరచారు.’’ఎలాంటి అవాంఛనీయ పరిస్థితులు ఎదురైనా తట్టుకొని నిలబడగలిగే సరఫరా గొలుసు అత్యంత ముఖ్యం. ఆర్థిక వ్యవస్థల్లో వివిధ రంగాల్లో అలాంటి సరఫరా గొలుసును సృష్టించడానికి భారత్ కృషి చేస్తోంది. కొవిడ్ సమయంలో ఈ విషయంలో మనకు ఎదురుదెబ్బలు తగిలాయి. విూరు భారత్‌లో పెట్టుబడులు పెడితే.. 21వ శతాబ్దంలో చిప్స్ కొరత ఎప్పటికీ రాదు. ఒక డయోడ్ దాని శక్తిని ఒక దిశలోనే తీసుకెళ్తుంది. కానీ భారత చిప్ పరిశ్రమకు ప్రత్యేక డయోడ్లు ఉన్నాయి. వాటికి శక్తి రెండువైపులా వెళ్తుంది. విూరు పెట్టుబడి పెట్టండి. విలువను సృష్టించుకోండి. విూకు ప్రభుత్వం స్థిరమైన విధానాలను అందిస్తుంది. విూ వ్యాపారాన్ని సులభతరం చేస్తుంది’’ అని మోదీ హావిూ ఇచ్చారు.
కరోనాకు పుట్టినిల్లయిన చైనాలో వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు కఠిన ఆంక్షలు అమలు చేయడంతో ఆ దేశ దిగుమతులపై ఆధారపడిన పలు దేశాలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యాయి. అలా ఇబ్బందులకు గురైన విభాగాల్లో సెవిూకండక్టర్ల రంగం కూడా ఉంది. దీంతో చాలా దేశాలు సెవిూకండక్టర్ల తయారీకి ప్రత్యామ్నాయంగా భారత్‌వైపు మొగ్గు చూపుతున్నాయి. ఈ క్రమంలోనే ప్రధాని వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.