*రక్తదానం చేసి,మరొకరి ప్రాణాన్ని కాపాడండి*

 గద్వాల నడిగడ్డ, ఆగస్టు 17 (జనం సాక్షి);
 రక్తదానం చేసి మరొకరి ప్రాణాల్ని కాపాడాలని జిల్లా  జడ్పీ చైర్ పర్సన్ సరిత  అన్నారు. బుధవారం జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో భారత స్వాతంత్ర వజ్రోత్సవాల ను పురష్కరించుకొని  వైద్య ఆరోగ్యశాఖ  అద్వర్యం లో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి, ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డితో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా  స్థానిక శాసనసభ్యులు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, కౌన్సిలర్లు రక్తదానం చేయగా జడ్పీ చైర్మన్ ,కలెక్టర్  ధృవీకరణ  పత్రాలు  అందజేశారు. ఈ సందర్భంగా జడ్పీ చైర్ పర్సన్  మాట్లాడుతూ స్వాతంత్ర వజ్రోత్సవాల సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెద్ద ఎత్తున రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేశాయని, జిల్లాలోని యువతీ, యువకులు రక్తదానం చేసి ప్రాణదాతలు కావాలని ఆమె సూచించారు.
జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి మాట్లాడుతూ రక్తదానం చేయడం వల్ల మరొకరి ప్రాణాలు నిలిపిన వారం అవుతామని అన్నారు. ప్రతి మూడు మాసాలకు ఒకసారి రక్తదానం చేయవచ్చని రక్త దానం చేయడం అలవాటుగా మార్చుకొని ఇతరులకు ఆదర్శంగా నిలవాలని తెలిపారు. ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి మాట్లాడుతూ ఈనెల 8 నుండి 22 వరకు జరిగే స్వాతంత్ర వజ్రోత్సవాల సందర్భంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగిందని ఈరోజు మొత్తం 94  మంది  పెద్ద ఎత్తున యువకులు హాజరై రక్త దానం చేశారని , వారిని అభినందించారు.
అనంతరం 16 లక్షలతో ఏర్పాటుచేసిన ఆర్టీపిసిఆర్ పరీక్షా కేంద్రాన్ని ప్రారంభించారు.  ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి చందు నాయక్, మున్సిపల్ చైర్మన్ బిఎస్ కేశవ్,డి ఎస్ పి  రంగస్వామి ,ఆసుపత్రి సూపరింటెండెంట్ కిషోర్ కుమార్, ఆర్డీవో రాములు, తాసిల్దార్ లక్ష్మి,డాక్టర్లు, వైద్యసిబ్బంది తదితరులు  పాల్గొన్నారు.