వేడెక్కిన హుజూరాబాద్‌ ప్రచారం

కరోనాతో భారీ సభలకు అనుమతి లేదు
రేవంత్‌ కూడా ప్రచారంలో పాల్గొనే అవకాశం
అంతిమ విజయం తమదే అంటున్న బిజెపి నేత జితేందర్‌ రెడ్డి
హుజూరాబాద్‌,అక్టోబర్‌9 (జనంసాక్షి): ఇప్పటికే ప్రచారంలో దూసుకుపోతున్న టిఆర్‌ఎస్‌, బిజెపిలకు ఇక కాంగ్రెస్‌ తోడు కానుంది. పిసిసి చీఫ్‌ రేవంత్‌ కూడ ఆరంగంలోకి దిగడం ద్వారా ఉప ఎన్నిక ప్రచారాన్ని వేడెక్కించనున్నారు. శుక్రవారంతోనామినేషనల్‌ ఘట్టం ముగిసింది. అయితే కరోనా ఆంక్షల నేపథ్యంలో భారీ సభలకు అనుమతి లేదు. దీంతో కొద్దిమందితో ప్రచారం చేసుకునే వెసులబాటు మాత్రమే ఇసి కల్పించింది. ఇందులో రేవంత్‌ పాల్గొన్నారు. ఇకపోతే ఈటెలను ఓడిరచడమే లక్ష్యంగా కెసిఆర్‌ ఇప్పటికే
అక్డ వ్యూహాలకు పదను పెట్టారు. తమకు పోటీ బిజెపితోనే అని మంత్రి హరీష్‌ రావు ప్రకటించడం కవేలం ఈటెలను టార్గెట్‌ చేయడం కోసం తప్ప మరోటి కాదు. ఇకపోతే బిజెపి కూడా కెసిఆర్‌ లక్ష్యంగా ప్రచారంలో దూసుకుని పోతోంది. ఈటల రాజీనామాతో కేసీఆర్‌ కుటుంబ పీఠాలు కదులుతున్నాయని ఇక్కడ బిజెపి ఎన్నికల ప్రచార ఇన్‌ఛార్జ్‌గా ఉన్న మాజీ ఎంపి జితేందర్‌ రెడ్డి అన్నారు. హుజూరాబాద్‌లో జరుగుతున్న ఉప ఎన్నిక ప్రజాస్వామ్యానికి… నియంతృత్వానికి మధ్య జరుగుతున్న ఎన్నికలని అన్నారు. నేను నా కుటంబం మాత్రమే ఉండాలి, మమ్మల్ని ఎవరూ ప్రశించకూడదనే దుర్మార్గ ఆలోచన కేసీఆర్‌దన్నారు. ప్రశ్నించే వారు, ఆత్మగౌరవంతో ఉండే వారు ఉండకూడదని కేసీఆర్‌ భావిస్తున్నారన్నారు. నీతి నిజాయితీతో, ఆత్మాభిమానంతో తన కంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న వ్యక్తి ఈటల రాజేందర్‌ అన్నారు. కెసిఆర్‌ నిరంకుశ పాలనకు చరమగీతం పాడేందుకు తెలంగాణ ప్రజలకు హుజూరాబాద్‌ అవకాశం ఇచ్చిందన్నారు. వందల కోట్లు ఖర్చు పెట్టినా, కేసులు పెట్టినా, ఇక్కడి ప్రజలు భయపడకుండా తమ నిర్ణయాన్ని నిరూపించాలన్నారు. తెలంగాణను కేసీఆర్‌ కుటుంబానికి ఎవరూ రాసి ఇవ్వలేదన్నారు. దళితులకు మూడెకరాలు ఇస్తానని చెప్పలేదని అసెంబ్లీలోనే అబద్దం చెప్పారన్నారు. మాట తప్పడం.. మడమ తిప్పడం కేసీఆర్‌ నైజం అన్నారు. మూడున్నర కోట్ల ప్రజల భవిష్యత్తును తీర్చదిద్దే ఎన్నిక ఇది.. వచ్చే శాసనసభ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పోవడం బీజేపీ రావడం ఖాయం అని జితేందర్‌ రెడ్డి అన్నారు. ప్రజలు మార్పు కోరుకుంటున్నార న్నారు. ఏడు సంవత్సరాల నుంచి ఎన్నిక వచ్చినప్పుడు ఇచ్చిన హావిూ మళ్లీ ఇవ్వడం, ప్రజలను మభ్య పెట్టడం, ఎన్నిక అవ్వగానే మోసం చేయడం కేసీఆర్‌ నైజమన్నారు. కేంద్రం రాష్ట్ర ప్రభుత్వానికి అన్ని విధాలుగా సాయం అందిస్తుంటే.. కేసీఆర్‌ మాత్రం గ్రామ పంచాయతీలకు నిధులు విడుదల చేయడం లేదన్నారు. కెసిఆర్‌ నియంతృత్వ ప్రభుత్వాన్ని ప్రశ్నించాలంటే ప్రజలు ఈటెలకు ఓటేయాలన్నారు. టీఆర్‌ఎస్‌కు ఉప ఎన్నికల్లో కర్రు కాల్చి వాత పెట్టడానికి హుజూరాబాద్‌ ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు. కేసీఆర్‌ దిమ్మ దించి, చెంప చెళ్లుమనిపించాలన్నారు. ఉద్యమ సహచరులు, ప్రజాస్వామ్య వాదులు కూడా కేసీఆర్‌ అహంకారం అణగాలని కోరుకుంటున్నారని అన్నారు.కేసీఆర్‌ అహంకారాన్ని ఓడిరచడానికి విూ అందరి సహకారం కోరుతున్నానన్నారు. రేవంత్‌ ఇక ఎప్పుడు ప్రచారంలోకి దిగేది తెలియదు. కరోనా ఆంక్షల నేపథ్యంలో భారీ సభలకు అవకాశం లేకుండా పోయింది. దీంతో కెసిఆర్‌, కెటిఆర్‌ ప్రాచరం ఉండదని తెలుస్తోంది.