సిద్దిపేటలో భారీగా ఏర్పాట్లు

సిద్ధిపేట,డిసెంబర్‌6(జ‌నంసాక్షి): మంత్రి హరీష్‌ రావు ప్రాతిధ్యం వహిస్తున్న సిద్దిపేట జిల్లాలో పోలింగ్‌ సజావుగా జరిగేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని కలెక్టర్‌ కృష్ణ భాస్కర్‌ తెలిపారు. పోలింగ్‌ రోజున సెలవు నేపథ్యంలో ప్రతీ ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని, ప్రలోభాలకు లొంగవద్దని ప్రజలకు కలెక్టర్‌ కృష్ణభాస్కర్‌ పిలుపునిచ్చారు.జిల్లాలోని సిద్దిపేట, గజ్వేల్‌, దుబ్బాక, హుస్నాబాద్‌ నియోజకవర్గాల్లో 1102 పోలింగ్‌ స్టేషన్లు ఉన్నాయి. అన్ని పోలింగ్‌ స్టేషన్లలో కరెంట్‌ సరఫరా, మంచి నీటి సదుపాయంతో సహా అన్ని ఏర్పాట్లు చేశామని చెప్పారు. సిద్దిపేటలో 8లక్షల పైచిలుకు ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోనున్నట్లు తెలిపారు. దాదాపు 15వేల మంది పోలింగ్‌ సిబ్బంది విధుల్లో ఉంటారని, రిటర్నింగ్‌ ఆఫీసర్‌ కార్యాలయంలో స్పెషల్‌ కంట్రోల్‌ రూంలను ఏర్పాటు చేశామన్నారు. అలాగే ఎలాంటి అవాంచనీయ ఘటనలు జరుగకుండా జిల్లా నుంచి 500 మంది పోలీసులు, 700మంది ¬ంగార్డులు, 680 పారామిలటరీ ఫోర్స్‌తో భద్రతను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. తొలిసారిగా ప్రతీ పోలింగ్‌ స్టేషన్‌లో ఏదో రకంగా రికార్డింగ్‌ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు.