పెంచిన అధిక ధరలను వెంటనే తగ్గించాలి: గురిజాల గోపి

పినపాక నియోజకవర్గం ఆగస్టు 05 (జనం సాక్షి):

నిత్యవసర వస్తువులు, పెట్రోల్, డిజిల్, గ్యాస్ పై పెంచిన అధిక ధరలను వెంటనే తగ్గించాలని పి సి సి పిలుపు మేరకు పినపాక నియెజకవర్గం మణుగూరు మండల కాంగ్రెస్ నాయకులు విజయ్ గాంధీ , మండల అధ్యక్షులు గురిజాల గోపి ఆద్వర్యం లో అంబేద్కర్ సెంటర్లో శుక్రవారం రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా గురిజాల గోపి మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పేదవాని జీవితంతో చెలగాటం ఆడుతున్నారన్నారు. పేద ప్రజల పై అధిక ధరలు పెంచటం తో అప్పులపాలై బ్రతుకు భారంగా గడుస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేసారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు పేదోడు మూడు పూటలా కడుపునిండా భోజనం చేశారని అధిక ధరల వల్ల ఒక పూటే భోజనం చేసి పస్తులుoడాల్సిన పరిస్థితి నెలకొంది. ఆధిక ధరలతో రోజు కూలీ పని చేస్తే వచ్చిన డబ్బులతో పప్పు దినుసులు కొనటానికి కూడా సరిపోవడం లేదని అన్నారు. వారి సంపాదన రోజువారీ సరుకులు కొనలేని పరిస్థితిలో ఉన్నారని పేదోడి కడుపు కోత మంచిది కాదని అన్నారు.పెంచిన అధిక ధరలను వెంటనే తగ్గించాలని లేని పక్షంలో కాంగ్రెస్ తరపున రాష్ట్ర స్థాయిలో ఉద్యమాలు ఉద్రిక్తం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మండల వర్కింగ్ ప్రెసిడెంట్ జనాపాటి నాగు, మండల వైన్ ప్రెసిడెంట్ కంప రవి, కొమరం రాముర్తి, బి సి సెల్ అద్యక్షులు కోడం సాంబశివరావు. ఎస్సి సెల్ అధ్యక్షులు వావిలాల నర్సయ్య, మైనార్టి సేల్ అధ్యక్షులు. ఎం డి. షరిఫ్, సాల్వంచ రాయులు, కాంగ్రెస్పార్టీ సీనియర్ నాయకులు బగ్గుల నీర్సయ్య . యువజన నాయకులు . తెల్లం నాగేశ్వరావు, శేఖర్ కీషన్ గుట్టమల్లరం జే ఏ సి కమిటి సభ్యులు తదితరులు పాల్గోన్నారు.