3న అమెజాన్‌ ప్రైమ్‌లో కెజిఎఫ్‌`2 విడుదల

కన్నడ సినిమా చరిత్రలోనే సంచలనం సృ`ష్టించిన కేజీఎఫ్‌ సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో
అందరికీ తెలిసిందే. అదే ఉత్సాహంతో దానికి సీక్వెల్‌ గా సెన్సేషన్‌ దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ రూపొందించిన కేజీఎఫ్‌ చాప్టర్‌ 2 సైతం కనీవినీ ఎరుగుని రీతిలో.. ఇప్పటికీ రోజుకో రికార్డు బ్రేక్‌ చేస్తూ కలెక్షన్‌ పంట పండిస్తూ విజయ పథంలో దూసుకుపోతోంది. ఎప్రిల్‌ 14న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం… బాలీవుడ్‌లో రికార్డు స్థాయిలో కలెక్షన్స్‌ రాబట్టి రూ.400 కోట్ల క్లబ్‌లో అడుగుపెట్టింది. నార్త్‌ లోనూ బాహుబలి తర్వాత అంతటి ఘనత సాధించిన సినిమాగా కేజీఎఫ్‌ 2 నిలిచి అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. ఇక ఇటీవలే రూ.1200కోట్ల క్లబ్‌ లో అడుగుపెట్టగా.. ప్రస్తుతం ఈ సినిమా ఓటీటీలోనూ సందడి చేస్తూ.. తన హవా కొనసాగిస్తోంది. ఇకపోతే తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన డిజిటల్‌ మూవీ హక్కులను అమెజాన్‌ ప్రైం వీడియోస్‌ సొంతం చేసుకుంది. ఇంతకు ఈ చిత్రం ఓటీటీలో రిలీజ్‌ అయినా..పే ఫర్‌ వ్యూ అనే పద్దతిలో సబ్‌స్కైబ్రర్లు అదనంగా రూ.199 పెట్టి సినిమా చూసే విధానాన్ని అందుబాటులోకి తెచ్చినప్పటికీ.. తాజాగా ఆ పద్దతిని తొలగించి ఫ్రీ గా వీక్షించేందుకు వెసులుబాటు కల్పిస్తోంది అమెజాన్‌. ఈ నేపథ్యంలో జూన్‌ 3 నుంచి సబ్‌స్కైబ్రర్‌లు ఈ చిత్రాన్ని ఉచితంగా చూసే అవకాశాన్ని కల్పించడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రంలో.. బాలీవుడ్‌ స్టార్‌ సంజయ్‌ దత్‌, నటి రవీణ టాండన్‌ రావూరమేష్‌, ప్రకాశ్‌రాజ్‌లు కీలకపాత్రల్లో నటించారు.