‘అకాడమీ’ అనువాదానికి లొంగుతుందా?

కొన్ని పదాలు అనువాదాలకి లొంగవు. వాటిని అనువాదం చేద్దామని ప్రయత్నం చేయడం కన్నా అదేవిధంగా వాటిని వాడితేనే అందంగా వుంటుంది. అనువాదం చేసే క్రమంలో కొంత మంది రచయితలు దాన్ని అర్థాన్ని వివరిస్తూ వుంటారు. దానివల్ల అది మరింత కఠినతరం అవుతుంది. అనువాదం కన్నా కొన్ని పదాలని సృజన చేస్తే బాగుంటుంది. అవి కూడా కృతకంగా వుండకూడదు. కృతకంగా లేకపోయినా కొన్ని సందర్భాల్లో ప్రజల ఆమోదయోగ్యం లభించదు. ప్రజల ఆమోదయోగ్యం లభించాలంటే ఆ పదాల అనువాదాలు ప్రజల వాడుక నుంచి రావాలి. రైలు ‘సిగ్నల్‌’ అ న్న పదాన్ని అనువాదం చేసి దాన్ని చదవడానికి వీల్లేకుండా చేశా రు. మాట్లాడటానికి అది ఎంత మాత్రం అనువుగా వుండదు. దాని తెలుగు అనువాదం ఇలా వుంటుంది. ‘దూమశకట గమనాగమన సూచిక లంబ తామ్ర పట్టిక’. ఇలాంటి అనువాదాలు చేస్తే ప్రజలు వాడకపోవడమే కాకుండా అసహ్యించుకుంటారు. అనువాదాలు చేస్తే ప్రజలు వాడకపోవడమే కాకుండా అసహ్యించుకుంటారు కూడా. అనంతపురం ప్రాంతంలో ‘సిగ్నల్‌’ని ‘రెక్కమాను’ అంటారు. ఇది ప్రజల నుంచి వచ్చింది. వినసొంపుగా వుంది. సులభంగా వుంది. రచయితలు, పత్రికా రచయితలు చేసే సృష్టి కన్నా ప్రజల సృష్టి మరీ అందంగా వుంటుంది.ఈ మధ్య ఈనాడు నాగేశ్వరరావు ఈ విషయం గురించి ఒక మంచి అనుభవం చెప్పారు. అది ‘డ్రిప్‌ ఇరిగేషన్‌’ (ణతీఱజూ ఱతీతీఱస్త్రa్‌ఱశీఅ). దాన్ని వాళ్లు ‘బిందు సేద్యం’గా అనువాదం చేసి పత్రికలో వాడటం మొదలు పెట్టారు. ఈ అనువాదం సిగ్నల్‌ అనువాదం మాదిరిగా కృతకంగా లేదు. సుల భంగా వుంది. వినసొంపుగా వుంది. కానీ వారు చేసిన అనువాదం కన్నా ప్రజల వాడుకలో వున్న అనువాదం ఇంకా బాగుంది. ‘బిందు సేద్యం’ చేస్తున్నారా!’ అని కొంతమంది రైతులని ఓ సందర్భంలో అడిగితే వాళ్లు తెల్లమొఖం పెట్టారట. ఆ తరువాత ‘డ్రిప్‌ ఇరిగేషన్‌’ గురించి వివరించిన తరువాత ‘చుక్కల సాగా!’ అని వాళ్లు అన్నారట. డ్రిప్‌ ఇరిగేషన్‌కి ప్రజలు చేసుకున్న అనువాదం ‘చుక్కల సాగు!’ బిందు సేద్యం కన్నా ‘చుక్కల సాగు’ అన్న పదబందం సులభంగానే కాదు అర్థవంతంగా వుంది. ప్రజల నుంచి వచ్చే అనువాదాలు అర్థవంతంగా వుంటాయి.మీడియాలో వున్న వ్యక్తులకి వున్న వెసులుబాటు మిగతా వాళ్లకి లేదు. వాళ్లు కొత్త పదాలని సృష్టించి వాడటానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఆ క్రమంలో మంచి అనువాదం వచ్చే అవకాశం వుంది. అన్ని పత్రికలు ఈ పనిని చేపడితే తెలుగులో కొత్త పదాలు సృజన జరుగుతుంది. అది అవసరం కూడా. కొత్త అనువాదాలు కొత్తలో కొంత ఇబ్బందిక రంగా ఎబ్బెట్టుగా అన్పించినా కాలక్రమంలో వాటికి తెలుగుదనం వస్తుంది. ప్రజల ఆమోదయోగ్యం కూడా లభిస్తుంది.
‘జశీఅఙశీవ’ అన్న పదాన్ని వాహనశ్రేణిగా కొన్ని పత్రికలు వాడుతున్నాయి. ఇది కొంత ఇబ్బందిగా మొదట అన్పించినా కొంతకాలం తరువాత అలవాటు పడడానికి అవకాశం వుంది. కొత్త పదబందాలకి అనువాదాలు సృష్టించడం ఎంత అవసరమో మరికొన్ని పదబందాలు పదాలు కనుమరుగు కాకుండా చూడాల్సిన బాధ్యత కూడా అందరిపైనా వుంది. మరీ ముఖ్యంగా మీడియాపైన వుంది.అన్ని పదాలు అనువాదాలకి లొంగవు. మరో విధంగా చెప్పాలంటే చాలా రోజులుగా ఆ పదాలని ఆ విధంగానే వాడటం వల్ల అనువాదం చేస్తే ప్రజల ఆమోదం కష్టమవుతుంది. ూఱస్త్రఅ శీటట, ూఱస్త్రఅ శీబ్‌ లాంటి కొత్త పదబందాల అనువాదాలని త్వరితంగా చేసి వాటిని వాడుకలో పెట్టాలి. అప్పుడే వాటిని అందరూ వాడటం మొదలు పెడతారు. ఆ విధంగా కాకుండా చాలాకాలం తరువాత వాటిని అనువదిస్తే వాటికి అంత త్వరగా ప్రజల ఆమోదం లభించకపోవచ్చు.
మరికొన్ని పదాలు వుంటా యి. వాటిని అనువాదం చే యకుండా వుంటేనే మం చిది. అనువాదం చేస్తే అది కృతకంగా వుంటుంది. అలాంటి ఓ పదబంధం ‘అకాడమీ’ ఈ పదాన్ని కొ న్ని సంస్థలు అనువాదం చేయడానికి ప్రయత్నం చేసి విఫలమైనాయి. మరికొన్ని సంస్థలు వాటిని అనువా దం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాయి. ‘అకాడమీ’ అన్న పదబంధం సుదీ ర్ఘంగా ప్రయాణం చేసింది. ఇప్పుడు దాన్ని అనువాదం చేయడం అంత సబబుగా అన్పించడం లేదు. దేశవ్యాప్తంగా వివిధ భాషల్లో ‘అకాడమీ’ని అకాడమీగానే వాడుతున్నారు. ‘సాహిత్య అకాడమీ’ అన్న సంస్థనే దాన్ని అదేవిధంగా వాడుతున్నప్పుడు ఇప్పుడు దాన్ని అనువాదం చేయడం రుచించదు.
తెలుగులో కూడా ఈ పదబంధాన్ని అదేవిధంగా వాడుతున్నారు. సాహిత్య అకాడమీ, నాటక అకాడమీ, చిత్రకళా అకాడమీలాంటి సంస్థలు బతికి వున్న రోజుల్లో వాటిని అలాగే వాడారు. తెలుగు భాషాభావృద్ధికి, తెలుగులో విద్యాభివృద్ధి చేయడానికి ఉద్దేశించిన ‘తెలుగు అకాడమీ’ కూడా ఈ అకాడమీ అన్న పదాన్ని అనువాదం చేయడానికి సాహసించలేదు. ఆ తరువాత చాలా అకాడమీలు వచ్చాయి. ఆంధ్ర పోలీస్‌ అకాడమీ, ఆంధ్రప్రదేశ్‌ జ్యుడిషియల్‌ అకాడమీ, ఎక్సైజ్‌ అకాడమీ, ఫారెస్టు అకాడమీ ఇలా, అయితే చాలా అకాడమీలు ఈ పదాన్ని తెలుగులో అదేవిధంగా వాడుతున్నారు. కొన్ని అకాడమీలు తెలుగులో పరిషత్తుగా అనువా దం చేశాయి. ఈ అనువాదం వల్ల ఆ అకాడమీ కుంచిం చుకుపోయినట్టు అన్పిస్తుంది. ఇలాంటి భావన కన్పిస్తున్నప్పుడు, ఇంతకాలం తరువాత వాటిని అనువాదం చేయకపోవడమే మంచిది.’అకాడమీ’ అన్న పదబంధం చాలాకాలంగా వుంది. ప్లేటో కాలం నుంచి ఈ పదబంధం వాడుకలో వుంది. ప్లేటో తన శిష్యులకి విద్యాబోధన చేసిన స్థలాన్ని అకాడమీగా పిలిచే వాళ్లు. క్రీస్తుకి పూర్వం 6వ సెంచరీలో ఆ ఉద్యానవనాన్ని జిమ్నాస్టిక్‌ కోసం ఉపయోగించేవాళ్లు. అకాడమీస్‌ అన్న పురాణ నాయకుడు ఆ తోట పెంపొందించి జిమ్నాస్టిక్స్‌ కోసం ఉపయోగించాడు. ఏథెన్స్‌ నగరానికి ఒక మైలు దూరంలో ఆ తోట వుంది. అతని తరువాత ఆ ప్రాంతానికి అకాడమస్‌గా పేరొచ్చింది. హిప్పీయాస్‌ అన్న వ్యక్తి ఆ ప్రాంతాన్ని అభివృద్ధి పరిచాడు. దాని చుట్టూ గోడకట్టాడు. శిల్పాలు నిర్మించాడే. తవ్వకాలలో హిప్పీయాస్‌ నిర్మించిన గోడ కూడా దర్శనమిచ్చింది. ఖమాన్‌ అన్న వ్యక్తి ఆలివ్‌ వృక్షాలని అక్కడ నాటించాడు. అథ్లెటిక్స్‌కి సంబంధించిన పందేలు అక్కడ జరిగేవి.
ప్లేటో ఇల్లు ఆ ఉద్యానవనం దగ్గర్లో వుండేది. క్రీస్తుపూర్వం 387 సంవత్సరంలో తన శిష్యులకి ప్లాటో విద్యాబోధనలు చేశాడు. విద్యాబోధన చేసే ప్రదేశాన్ని, శిక్షణ ఇచ్చే ప్రదేశాన్ని అకాడమీగా పరిగణించడం మొదలైంది. ప్లేటో నుంచి అరిస్టాటిల్‌ దాకా అక్కడ విద్యాబోధన జరిగింది.విశ్వవిద్యాలయాలకి, అకాడమీలకి భేదం వుంది. అత్యున్నత విద్యాభ్యాసం విశ్వవిద్యాలయాల్లో వుంటుంది. అకాడమీల్లో విద్యాబోధన మాత్రమే కాదు. కళా, సాహిత్యం, విద్యలాంటి రంగాల్లో అత్యున్నతస్థాయిలో చర్చలు వుంటాయి. ఇలాంటి పదబంధాన్ని అనువాదం చేసి అభాసుకావడం కన్నా అనువాదం చేయకపోవడమే మంచిది.అయితే కొన్ని పదాలని పదబంధాలని అనువాదం చేయవచ్చు. కాలక్రమంలో అవి ప్రజల మన్ననలని పొందుతున్నాయి. హైకోర్టుని ఉన్నత న్యాయస్థానంగా వాడుతున్నాం. అదేవిధంగా సుప్రీంకోర్టుని సర్వోన్నత న్యాయ స్థానంగా ఉపయోగిస్తున్నాం. ఈ అనువాదాలు ఇటీవల కాలంలో చేసినప్పటికీ ఇవి అతి తక్కువస్థాయి అనువాదాలుగా అన్పించడం లేదు.
‘లా ఆఫీసర్‌’ అంటే ప్రభుత్వం తరుఫున వాదించే న్యాయవాదులు. జ్యుడిషియల్‌ ఆఫీసర్స్‌ అంటే న్యాయాధికారులు. వీటి అనువాదం ఇంకా ఆమోదయోగ్యం కాలేదు. అదేవిధంగా జ్యుడిషియల్‌కి, లీగల్‌కి తెలుగులో సరైన అనువాదాలు లేవు. ూష్‌ అంటే కొంతమంది చట్టమని అంటున్నారు. మరికొంతమంది శాసనం అంటున్నారు. ఇలాంటి కొన్ని ఇబ్బందులు వున్నా కాలక్రమంలో ప్రామాణికత ఏర్పడుతుంది. ప్రామాణికత పేరుతో ఒక ప్రాంత ఆధిపత్యాన్ని సహించే స్థితిలో ఈ రోజు ప్రజలు లేరు. ఈ అంశాలని దృష్టిలో పెట్టుకొని అనువాదాలు చేయాల్సిన అవసరం వుంది.
ఇంగ్లిష్‌లో కొత్త పదాలు రాగానే వాటిని తెలుగులోకి అనువాదం చేయాలి. వాడుకలో ఆ అనువాదం రూపాంతరం చెంది వాడుకయోగ్యంగా మారుతుంది. ప్రజలు దాన్ని ఇంకా సులభంగా అనువాదం చేస్తారు. అప్పుడు అదిపూర్తి ఆమోదయోగ్యం అవుతుంది. అనువాదం చేసే క్రమంలో కొత్త పదాల సృష్టి జరగాలి. అంతేకాని ‘సిగ్నల్‌’ మాదిరిగా వివరించి గందరగోళ చేయకూడదు.
అనువాదాలకి లొంగని పదాలని అదేవిధంగా వాడాలి. వాటిని అనువాదం చేసి వాటి స్థాయిని కించపరచకూడదు. అకాడమీ అన్న పదం అనువాదానికి లొంగదు. దాన్ని అదేవిధంగా వాడితే మంచిది.