ఎసిబి వలలో ఎస్ డిఎం
మహబూబాబాద్ (జనంసాక్షి)
మహబూబాబాద్ జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయంలోని జిల్లా సర్వే, భూమి రికార్డుల అధికారి కార్యాలయంలో ఎసిబి దాడి జరిగింది. ఈ క్రమంలో రూ.20 వేలు లంచం తీసుకుంటూ సీనియర్ డ్రాఫ్ట్ మాన్ (SDM) అధికారి జ్యోతి శర్మ బాయ్ పట్టుబడింది. మరిన్ని అంశాలపై అధికారులు విచారణ కొనసాగిస్తున్నారు.