` మాహారాష్ట్రలో ఎన్డీఏ, ఝార్ఖండ్లో ఇండియా కూటమి


` రెండు రాష్ట్రాల్లోనూ అధికారం నిలబెట్టుకున్న పార్టీలు
` మహారాష్ట్రలో మహాయతి కూటమిదే అధికారం
` జార్ఖండ్‌లో మళ్లీ సత్తా చాటిన హేమంత్‌ సోరెన్‌
` జార్ఖండ్‌లో ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాలు తారుమారు
న్యూఢల్లీి(జనంసాక్షి):మహారాష్ట్ర, రaార్ఖండ్‌ శాసనసభల ఎన్నికల ఫలితాలు శనివారం వెల్లడయ్యాయి. మహారాష్ట్రలో అధికార మహాయుతి కూటమి అఖండ విజయం సాధించింది. ప్రతిపక్ష మహా వికాస్‌ అఘాడీ కూటమి కనీస పోటీ ఇవ్వలేకపోయింది. అటు రaార్ఖండ్‌లో ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాలకు భిన్నంగా జేఎంఎం కూటమి జోరు ప్రదర్శించింది. ఈ క్రమంలో ఈ రెండు పార్టీలు మరోమారు ప్రభుత్వాలను ఏర్పాటు చేయడం ఖాయమైంది. మహారాష్ట్రలోని నాగ్‌పుర్‌ సౌత్‌ వెస్ట్‌లో భాజపా అభ్యర్థి, రాష్ట్ర ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌ ఆధిక్యంలో ఉన్నారు. బారామతిలో ఎన్సీపీ అభ్యర్థి అజిత్‌ పవార్‌ ముందంజలో కొనసాగుతున్నారు. వర్లీలో శివసేన (యూబీటీ) అభ్యర్థి ఆదిత్య ఠాక్రే ఆధిక్యంలో ఉన్నారు. కోప్రిలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ శిందే ముందంజలో కొనసాగుతున్నారు. ఇప్పటి వరకు వెలువడిన ఫలితాల సరళి ప్రకారం.. మహారాష్ట్రలో మహాయుతి కూటమి ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన సీట్లను దక్కించుకుని భారీ మెజార్టీ దిశగా సాగుతోంది. ప్రస్తుతం ఈ కూటమి 153 స్థానాల్లో గెలిచి, మరో 75 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. అటు ప్రతిపక్ష మహావికాస్‌ అఘాడీ కూటమి 30 స్థానాల్లో విజయం సాధించి, 24 స్థానాల్లో ముందంజలో ఉంది. మహారాష్ట్రలో మొత్తం 288 శాసనసభ స్థానాలుండగా.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు 145 ఎమ్మెల్యేలు అవసరం. రaార్ఖండ్‌లో జేఎంఎం కూటమి 32 స్థానాల్లో విజయం సాధించి మరో 24 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. అటు భాజపా నేతృత్వంలోని కూటమి 16 స్థానాల్లో గెలిచి, 8 స్థానాల్లో ముందంజలో ఉంది. ఈ రాష్ట్రంలో మొత్తం 81 అసెంబ్లీ స్థానాలుండగా.. మ్యాజిక్‌ ఫిగర్‌ 41.బర్‌హైత్‌లో రaార్ఖండ్‌ సీఎం హేమంత్‌ సోరెన్‌ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. గండేలో ఆయన భార్య కల్పనా సోరెన్‌ ముందంజలో ఉన్నారు. జార్ఖండ్‌ ఎన్నికల తుది ఫలితాలు రాత్రికి తర్వాత వెల్లడి కానున్నాయి. అయితే ఎన్నికల కమిషన్‌ ట్రెండ్స్‌ ప్రకారం జార్ఖండ్‌లో భారత కూటమి మెజారిటీ సాధిస్తుందని తెలుస్తోంది. ట్రెండ్స్‌ ప్రకారం జార్ఖండ్‌లో మరోసారి హేమంత్‌ సోరెన్‌ ప్రభుత్వం ఏర్పాటు కానుంది. తాజా సమాచారం ప్రకారం జార్ఖండ్‌లో ఇండియా అలయన్స్‌ 50 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఎన్డీయే 29 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. మిగిలిన 2 స్థానాల్లో ఇతరులు ఆధిక్యంలో ఉన్నారు. ఇప్పుడు పరిస్థితి చూస్తే ఈసారి కూడా జార్ఖండ్‌లో మరోసారి హేమంత్‌ సోరెన్‌ గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. జార్ఖండ్‌లోని 81 అసెంబ్లీ స్థానాలకు ఓట్ల లెక్కింపు జరుగుతోంది. తొలుత పోస్టల్‌ బ్యాలెట్‌ను లెక్కించి, కొంత సమయం తర్వాత ఈవీఎం యంత్రాల ఓట్ల లెక్కింపు పక్రియ చేపట్టారు. మొదటి పోకడలు ఇప్పుడే ఉద్భవించడం ప్రారంభించాయి. క్రమంగా ఫలితాలపై స్పష్టత వస్తుంది. జార్ఖండ్‌లో 13 నుంచి 27 రౌండ్ల వరకు ఓట్ల లెక్కింపు జరుగుతుంది. ఈసారి ఇద్దరు ముఖ్యమంత్రులు, మాజీ ఉపముఖ్యమంత్రులు ఎన్నికల పోరులో ఉన్నారు. ఒకవైపు భారత కూటమి, మరోవైపు ఎన్డీయే ఉంది. జార్ఖండ్‌లో 24 ఏళ్లుగా కొనసాగుతున్న సంప్రదాయానికి బ్రేక్‌పడిరది. హేమంత్‌ సోరెన్‌ ట్రెండ్స్‌లో పునరాగమనం చేస్తున్నాడు. నిజానికి 24 ఏళ్ల జార్ఖండ్‌ చరిత్రలో ఏ పార్టీ కూడా వరుసగా రెండోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఎప్పుడూ జరగలేదు. అయితే ఈసారి మాత్రం ఆ ట్రెండ్‌ మారే విధంగా అనిపిస్తోంది. కాగా ఎన్డీయే తరఫున బీజేపీ 81 స్థానాలకు గాను 68 స్థానాల్లో, ఏజేఎస్‌యూ 10 స్థానాల్లో తమ అభ్యర్థులను నిలబెట్టాయి. జేడీయూకు రెండు సీట్లు, చిరాగ్‌ పాశ్వాన్‌కు చెందిన ఎల్‌జేపీ-రామ్‌విలాస్‌కు ఒక సీటు ఇచ్చారు. 2019 ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా పోటీ చేసి 79 మంది అభ్యర్థులను నిలబెట్టగా, ంఏªూఙ 53 మంది అభ్యర్థులను ప్రకటించింది.

‘మహాయుతి’కి మోదీ అభినందనలు
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో అఖండ విజయం సాధించిన ’మహాయుతి కూటమి’కి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. ఇది అభివృద్ధికి, సుపరిపాలనకు ప్రజలు అందించిన విజయమని అభివర్ణించారు. ఐక్యంగా మరిన్న విజయతీరాలను సాధించాలని అభిలషించారు. ‘ఇది అభివృద్ధి విజయం. సుపరిపాలన సాధించిన గెలుపు. సమష్టిగా ఉంటే మనం మరింత ఎత్తుకు ఎదుగుతాం. ఎన్డీయేకు ఇంత చారిత్రిక విజయం అందించిన మహారాష్ట్ర ప్రజలకు ముఖ్యంగా యువతకు, మహిళలకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. మహారాష్ట్ర ప్రగతికి అహరహం పాటుపడతామని ప్రజలకు బీజేపీ కూటమి హావిూ ఇస్తోంది. జై మహారాష్ట్ర‘ అని మోదీ ఆ ట్వీట్‌లో పేర్కొన్నారు.
మోడీ నాయకత్వానికి అండగా మహారాష్ట్ర:కిషన్‌ రెడ్డి
ఏ ఎన్నిక జరిగినా బీజేపీదే విజయమని కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి అన్నారు. మోదీ నాయకత్వానికి అండగా నిలిచినందుకు మహారాష్ట్ర ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. మహావికాస్‌ అఘాడీ కూటమి విద్వేషాలు ప్రచారం చేశారని విమర్శించారు. ఎంవీఏ కూటమిని ప్రజలు నమ్మలేదన్నారు కిషన్‌ రెడ్డి. మహరాష్ట్ర ప్రజలు వారసత్వం చూడలేదన్నారు మహారాష్ట్రలో ఎన్డీయే కూటమికి ఓట్లు, సీట్లు భారీగా పెరిగాయన్నారు కిషన్‌ రెడ్డి. శరద్‌ పవార్‌ శకం ముగిసిందన్నారు. కాంగ్రెస్‌ కులం,మతం పేరుతో ప్రచారం చేసిందని.. మహారాష్ట్ర, జార్కండ్‌ లో కలిపి కాంగ్రెస్‌ కు 30 సీట్లు కూడా రాలేదని ఎద్దేవా చేశారు కిషన్‌ రెడ్డి. కాంగ్రెస్‌ పై ఎంత వ్యతిరేకత ఉందో అర్థమవుతోందన్నారు.ంఒªూక్ష ఖీఇంఆ । మహారాష్ట్రలో సీఎం ఈవీఎం కుట్ర అంటూ కాంగ్రెస్‌ కూటమి నేతలు తప్పుడు వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు కిషన్‌ రెడ్డి. సంజయ్‌ రౌత్‌ వ్యాఖ్యలు సిగ్గుచేటన్నారు. ఓడిపోయినప్పుడు ఈవీఎంలపై ఆరోపణలు చేయడం కాంగ్రెస్‌ కు అలవాటుగా మారిందని విమర్శించారు. కర్ణాటక, జార్ఖండ్‌, తెలంగాణలో గెలిచినప్పుడు ఈవీఎంలపై ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు కిషన్‌ రెడ్డి. కాంగ్రెస్‌ మూడు రాష్టాల్రకే పరిమితమైందన్నారు.

రాజ్యాంగంతోపాటు, సహజవనరులపై సాధించిన విజయం
` రaార్ఖండ్‌ విజయంపై రాహుల్‌గాంధీ
` మహారాష్ట్ర ఫలితాలు అనూహ్యం
` ఓటమిపై సమీక్షించుకుంటామని వెల్లడి
న్యూఢల్లీి(జనంసాక్షి):
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఘోర పరాజయం చెందిన విషయం తెలిసిందే. వీటిపై కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ స్పందించారు. ఈ ఫలితాలు అనూహ్యమని, సమగ్రంగా విశ్లేషిస్తామని అన్నారు. రaార్ఖండ్‌లో ఫలితాలపై మాట్లాడుతూ.. రాజ్యాంగంతోపాటు నీరు, అడవులు, భూమిపై విపక్ష కూటమి (ఎఔఆఎం) సాధించిన విజయమన్నారు. వయనాడ్‌లో ప్రియాంక గాంధీ ని స్థానిక ఓటర్లు భారీ మెజార్టీతో గెలిపించినందుకు గర్విస్తున్నానన్నారు. ఈ ప్రాంత సర్వతోముఖాభివృద్ధికి ప్రియాంక పాటుపడుతుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను అస్సలు ఊహించలేదని ప్రతిపక్ష నేత, శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్‌ ఠాక్రే పేర్కొన్నారు. అధికార మహాయుతి ఒక కెరటంలా కాకుండా సునావిూలా విరుచుకుపడిరదని వ్యాఖ్యానించారు. ఫలితాలు ఎలా ఉన్నా.. మహారాష్ట్ర హక్కుల కోసం పోరాడుతూనే ఉంటామన్నారు.మహారాష్ట్ర ఫలితాలు ఆశ్చర్యకరమని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జైరాం రమేశ్‌ పేర్కొన్నారు. ఎన్నికల పారదర్శకతపై తాము ప్రశ్నలను లేవనెత్తుతూనే ఉంటామన్నారు. ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ఎన్నికల్లో పారదర్శకతకు సంబంధించిన సమస్యలను లేవనెత్తడం తమ బాధ్యతన్నారు. రaార్ఖండ్‌ వాసులు తమ కోసం పనిచేసిన ప్రభుత్వాన్నే గెలిపించారని, విభజనవాద రాజకీయాలను తిరస్కరించారని వ్యాఖ్యానించారు.
మహారాష్ట్రలో ఇలాంటి ఫలితాలను ఊహించలేదు: ఖర్గే
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో విపక్ష మహా వికాస్‌ అఘాడీకు గట్టి ఎదురుదెబ్బ తగలడంపై కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే స్పందించారు. మహాయుతి కూటమి 230కి పైగా స్థానాల్లో అఖండ విజయం సాధించడంతో ఇలాంటి ఫలితాలను తాము ఊహించలేదన్నారు. ఈ పరిణామాన్ని లోతుగా పరిశీలించేందుకు, అసలు కారణాలేంటో తెలుసుకొనేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. ఛత్రపతి శివాజీ, డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ భావజాలానికి తామే నిజమైన ప్రతినిధులమని, తమ పోరాటం కొనసాగుతుందని తెలిపారు.రaార్ఖండ్‌ ప్రజలు మాత్రం తమ హక్కులు, నీరు, అటవీ, భూ సమస్యలకు ప్రాధాన్యమిచ్చారని ఖర్గే పేర్కొన్నారు. అందువల్లే విభజనవాద, నకిలీ రాజకీయాలను తిరస్కరించారన్నారు. సామాజిక న్యాయం కోసం పోరాడుతామని, ప్రజల గొంతుకను వినిపిస్తామన్నారు. రaార్ఖండ్‌లో జవాబుదారీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని తెలిపారు.రaార్ఖండ్‌లో విజయం సాధించిన హేమంత్‌ సోరెన్‌, ఇండియా కూటమికి తమిళనాడు సీఎం స్టాలిన్‌ అభినందనలు తెలిపారు. అధికార దుర్వినియోగంతో కూడిన ప్రతీకార రాజకీయాలు, గత ఐదేళ్లలో భాజపా అనేక అడ్డంకులు సృష్టించినప్పటికీ.. ధైర్యంగా, దృఢ సంకల్పంతో ఎదురొడ్డి నిలబడిన హేమంత్‌ విజయం సాధించారని ప్రశంసించారు. అన్ని పార్టీలను కలుపుకొని తీసుకెళ్లే ఆయన నాయకత్వంపై రaార్ఖండ్‌ ప్రజలు తమ విశ్వాసాన్ని ఈ ఎన్నికల్లో వ్యక్తపరిచారన్నారు. ప్రజాస్వామ్యం, లౌకికవాదానికి ఇదో గొప్ప విజయమని అభివర్ణించారు.