అక్రమ దందాలకు అడ్డాగా తిరుపతి 

ఆందోళనలో విద్యార్థుల తల్లిదండ్రులు
తిరుపతి,మే18(జ‌నం సాక్షి ):  తిరుపతి పరిసరాల ప్రాంతాలలోని శేషాచలం అడవుల నుంచి పెద్ద ఎత్తున రవాణా అవుతున్న ఎర్రచందనం స్మగ్లర్లు కూడా తిరుపతి అడ్డాగా వున్నారు. దీనికి తోడు  ఇక తిరుపతి నగరంలోకి పెద్ద ఎత్తున గంజాయి సరపరా అవుతుంది. ఎక్కువుగా రైల్వే పార్సిల్‌ ద్వారా వైజాగ్‌ ప్రాంతం నుంచి ఇక్కడికి వస్తుంటుంది. ఇప్పటివరకు పెద్ద పెద్ద నగరాలకు పరిమితమయిన డ్రగ్స్‌ ,హుక్కా సంస్కృతి ఇప్పుడు ఇక్కడా  విస్తరించిందన్న అనుమానాలు కలుగుతున్నాయి. విద్యార్థులతోపాటు యాత్రీకులను దృష్టిలో వుంచుకోని గంజా అమ్మకాలు సాగిస్తున్నారని తెలుస్తోంది. పడమటి మండలాలకు చెందిన ఓ ముఠా ఇందులో కీలకంగా వ్యవహారిస్తుందని అనుమానాలున్నాయి. పలుమార్లు పట్టుబడినప్పటికి వీరు ప్రతిసారి రవాణా మాత్రం అపడం లేదు. ఎక్సెజ్‌ శాఖ మాత్రమే అప్పుడప్పుడు తనిఖీలు నిర్వహిస్తుంది. అయితే చెన్నయి,బెంగుళూరుకు ఎక్కువుగా రవాణా జరుగుతుందని అంటున్నప్పటికి  రెండు సంవత్సరాలుగా స్థానిక మార్కెట్‌ ను వీరు విసృతం చేసినట్లు తెలుస్తోంది. ఇలా డ్రగ్స్‌, వ్యభిచార ముఠాలపై ఇప్పటికైనా పోలీసులు కఠినేంగా వ్యవహరించాలని విద్యార్థుల తల్లితండ్రులు కోరుతున్నారు. అలాగే  పరమ పవిత్రమైన తిరుపతిలో వ్యభిచార ముఠాలు అమాయక అమ్మాయిలను ముఖ్యంగా కాలేజీ అమ్మాయిలను ట్రాప్‌లో వేసి వారిని వ్యభిచార ఉచ్చులోకి దింపుతున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. గ్రావిూణ ప్రాంతాల నుంచి వచ్చే అమ్మాయిల ఆర్థిక స్థోమతను పసిగట్టి వారినీ ఉచ్చులోకి దింపుతున్నారని సమాచారం. తిరుపతి పర్యాటక, పుణ్యక్షేత్రం కావడంతో దేశవిదేశాల నుంచి ఇక్కడికి వస్తున్నారు. వీఇని లోబర్చుకుని డబ్బులు సంపాదించాలనుకుంటున్నవారు ఇలాంటి ముఠాలను తయారు చేస్తున్నారని  పోలీసులు కూడా అనుమానిస్తున్నారు. వీరు చాల వరకు ఆన్‌ లైన్‌ ద్వారా దందా నడిపిస్తున్నాయి. ముఖ్యంగా కాలేజీ విద్యార్థినుల బలహీనలతోపాటు అర్థికంగా లేని వారిని ట్రాప్‌ చేసి ఆటోవాలాలు రవాణా దారులుగా పెట్టుకోని ఈవ్యాపారాన్ని నడిపిస్తున్నారు. చాలమంది ఆటో వాలాలు హాస్టల్స్‌లో వున్న అమ్మాయిలకు కుటుంబ సభ్యుల లాగా పోన్‌ చేసి పిలిపిస్తారు. బయటకు రాగానే నేరుగా అప్పటికే ఆన్‌ లైన్‌ వ్యవస్థ ద్వారా బుకింగ్‌ అయిన కస్టమర్‌ దగ్గరకు తీసుకువెళుతున్నారు. ఈసమయంలో అటోలోకి ఎక్కగానే అమ్మాయి మొడలో రెడిమెడ్‌ తాళితో పాటు ,మొట్టెలు వేసుకొని వెళతారు.దీంతో రైడింగ్‌ల గొడవ కూడా వుండదు. ఈవ్యవహారంలో ఆన్‌ లైన్‌ బుకింగ్‌ దారుడుతో పాటు ఆటోవాల షేర్‌ పోను మిగతాకి అమ్మాయిలకు ఇస్తుంటారు. అయితే ఈ వ్యవహారం ఎక్కువుగా శని,అదివారాలలో జరుగుతుంటాయని సమాచారం. ఇక విద్యార్థినులను ట్రాప్‌ చేసి సరపరా చేస్తున్న వ్యక్తులు నాయకులకు కూడా వీరు పంపిస్తుంటారని అనుమానాలు ఉన్నాయి.