అర్హుల గుర్తింపు సరే..! డబల్ బెడ్ రూమ్ఇండ్లకీ ఎప్పుడు ఇస్తారు..?
భైంసా రూరల్ జనం సాక్షి ఆగస్టు18
– తెలంగాణ జన సమితి విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షులు సర్దార్ వినోద్ కుమార్.
తాలూకా వ్యాప్తంగా నిర్మించినటువంటి డబల్ బెడ్ రూమ్ ల అర్హులను ప్రకటించారు..!కానీ పంపిణీ కార్యక్రమం చేసి ఇండ్ల కీ ఎప్పుడు ఇస్తారని తెలంగాణ జన సమితి విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షులు సర్దార్ వినోద్ కుమార్ అన్నారు. శుక్రవారం భైంసా పట్టణంలోని విశ్రాంతి భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.తాలూక వ్యాప్తంగా ఇప్పటికీ డబల్ బెడ్రూంలో పంపిణీ కార్యక్రమం పూర్తి కాలేదని కొత్తగా గృహలక్ష్మి పథకం పేరు చెప్పి ప్రజలను మోసం చేయడమే తప్ప చేసిందేమీ లేదంటూ మండి పడ్డారు.భైంసా పట్టణంలో గతంలో ఇందిరమ్మ స్థలం కేటాయించిన వారి ప్లాట్లను సైతం బి.ఆర్.ఎస్ ప్రభుత్వం లాక్కుని అవే స్థలాలలో నూతన డబుల్ బెడ్రూంలో నిర్మించి వాళ్ళనే పక్కకు నెట్టేయడం ఎంతవరకు సమంజసం అని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం ఉన్న పథకాలను సక్రమంగా నడిపితే సరి, కొత్త పథకాలు తీసుకొచ్చి ప్రజలకి మోసం చేయొద్దంటూ..! ప్రజలన్నీ గమనిస్తున్నారని రానున్న ఎన్నికల్లో ప్రజలు వాళ్లకి సమాధానం చెప్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి తులసి రామ్, ఎస్. కే మినాజ్,ఎం. డి అలింఖాన్,రాజు,శ్రీనివాస్,అశోక్,కృష్ణ, సాబిర్ బాషా పలువురు పాల్గొన్నారు.