ఆ రెండు గ్రామాల్లో మద్యనిషేధం

సొంతంగా కట్టుబాట్లు పెట్టుకున్న గ్రామస్థులు
అనంతపురం,మే19(జ‌నం సాక్షి): అనంతపురం జిల్లాలో ప్రత్యేకత సంతచరిచుకున్న కహుమగ  గ్రామాల అభివృద్ధికి ప్రత్యేక శ్రద్ద తీసుకుంటామని మంత్రి కాల్వ శ్రీనివాసులు చెప్పారు. గ్రామ స్వరాజ్యం అనంతపురం జిల్లాలో రెండుగ్రామాల్లో సాక్షాత్కరిస్తుంచడం అదృష్టమని అన్నారు. అనంతపురం జిల్లా రాయదుర్గం నియెజక వర్గంలో అడిగుప్ప గ్రామమిది. రాష్ట్రంలో మద్యం ఏరులైపారుతున్నా అడిగుప్ప, సమ్మయ్య దొడ్డి గ్రామాల్లో కొన్ని దశాబ్దాలుగా సంపూర్ణ మద్యనిషేదం అమలులో ఉంది. గాంధీజీ కలలు కన్న గ్రామంగా ఆ రెండు గ్రామాలు కట్టుబాట్లతో నడుస్తున్నాయి. గ్రామస్తులంతా కలిసికట్టుగా జీవిస్తున్నారు. ఇక్కడ పగ, ప్రతీకారాలకుతావులేదు. అంతా శాంతి సామరస్యాన్ని పాటిస్తారు. ఇప్పటిదాకా ఈ గ్రామాల్లో పోలీసులు అడుగుపెట్టలేదు. పోలీసురికార్డులకు దూపంగా ఉంటున్నాయి ఈ రెండుగ్రామాలు. గ్రామాల్లో ఏపని చేయాలన్న రచ్చబండ దగ్గరచేరి నిర్ణయాలు తీసుకుంటారు. ఇలాంటి గ్రామాలు ఒకప్పుడు ఫ్యాక్షన్‌ పడగనీడలో వెలసిన జిల్లాలో ఉండడం విశేషం. ఒకటి అడిగుప్ప, రెండవది సమ్మయ్య దొడ్డి గ్రామం. మద్యం, ధూమాపాన ప్రియులు ఈ గ్రామాల్లో కనిపించరు. మాంసం తినరు. చివరకు కోళ్ళను పెంచరు. కోడిగుడ్డుకూడా తినరు. గ్రామాల్లో కనీసం కోళ్ళు కనిపించవు. చెడు అలవాట్లకు పూర్తిగా దూరంగా ఉంటున్నారు. ఇలా అన్ని గ్రామాల్లో జరిగేల స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలని మంత్రి కాల్వ పిలుపునిచ్చారు.  ఇక్కడి పాఠశాలలో తల్లిదండ్రుల, విద్యార్థుల కోరికమేరకు స్కూలు మెనూలో గుడ్డు బదులు అరటిపండును చేర్చారు. విధ్యాభోధన చేయడానికి  వచ్చిన ఉపాద్యాయులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తారు. ఈ గ్రామాలను చూసి మిగతా గ్రామాల్లో స్వచ్ఛత పాటించేలా ప్రోత్సహిస్తామని మంత్రి అన్నారు.