ఒక్కో కుటుంబానికి రూ 5మే ఇవ్వండి` ఉత్తమ్
హైదరాబాద్,మే 1(జనంసాక్షి): త్లెరేషన్ కార్డుతో సంబంధం లేకుండా దారిద్య్రరేఖకు దిగువున ఉన్న వారికి విపత్తు వేళ రూ.5వే చొప్పున సాయం అందించాని విపక్షనేతు డిమాండ్ చేశారు. తెంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్‌రెడ్డి, తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణ, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి, తెజస అధ్యక్షుడు కోదండరామ్ తదితయి బీఆర్కే భవన్‌లో సీఎస్ సోమేశ్ కుమార్‌ను కలిసి కరోనా సహాయక చర్యు, ఇతర అంశాపై చర్చించారు. ధాన్యం కొనుగోళ్ల విషయంలోనూ ప్రభుత్వం ఆదుకోవాని సీఎస్‌కు సూచించారు.సీఎస్ సమావేశం అనంతరం విపక్ష నేతు మాట్లాడుతూ.. ‘‘ప్రజల్లో విశ్వాసాన్ని పెంచాంటే ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరించాలి. కరోనా కట్టడికి అందరినీ కుపుకొనిపోయే విధంగా ప్రభుత్వం వ్యవహరించాలి. అన్ని ఆసుపత్రుల్లో కరోనా పరీక్షకు అవకాశం కల్పించాలి. 104, 108 సేవను పూర్తిస్థాయిలో అందుబాటులోకి తేవాలి. రాష్ట్రంలో కరోనా పరీక్షు చాలా తక్కువగా జరుగుతున్నాయి. వైద్య సిబ్బందికి వ్యక్తిగత రక్షణ పరికరాు అందించాలి. కరోనా నివారణకు పీహెచ్‌సీ సిబ్బంది సేమ వాడుకోవాలి. వైద్య సౌకర్యా క్పనకు మినరల్ ఫండ్‌ను వినియోగించాలి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుద చేయాలి’’ అని విపక్ష నేతు ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.