ఔరంగాజేబుకు ముచ్చెముటలు పట్టించిన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్..
–సర్పంచ్ల ఫోరం మండల ఉపాధ్యక్షురాలు సుశీల తిరుపతి గౌడ్.
జనం సాక్షి/సైదాపూర్ ఆగస్టు 18. మండలంలోని సోమారం గ్రామంలో సర్దార్ సర్వాయి పాపన్న చౌరస్తా వద్ద 373వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి.ఈ సందర్భంగా సర్పంచ్ పైడిమల్ల సుశీల తిరుపతి గౌడ్ మాట్లాడుతూ హాస్తిన పాలకుల వెన్నులో వణుకు పుట్టించిన తొలి తెలుగు తేజం. గోల్కొండ కోటపై మొగలాయిల పెత్తనాన్ని ధిక్కరించిన ధీశాలి. ఔరంగజేబుకే ముచ్చమటలు పట్టించిన పోరాట యోధుడు. బడుగు, బలహీన, పేదల పాలిట ఆపద్బాంధవుడు.సమసమాజ స్థాపన సాధనకు ప్రాణాలను పణంగా పెట్టిన వీరుడు.రాజరికంలో వికసించిన సామ్యవాద గొంతుక సర్దార్ సర్వాయి పాపన్న అని చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో రైతు సమన్వయ సమితి కోఆర్డినేటర్ పైడిమల్ల తిరుపతి గౌడ్,,కేక్కర్ల మొగిలి, అనగోని రమేష్,గడ్డం అబ్బయ్య,సంపత్,సమ్మిరెడ్డి, శంకర్ వీరవని మొగిలి గుర్రం లచ్చపతి,తదితరులు పాల్గొన్నారు.