కర్ణాటక తరహాలో 3000 ఓట్లకు క్లస్టర్ ఏర్పాటు
– విభేదాలు వీడి సమిష్టిగా ఉండి గెలుపే లక్ష్యంగా పని చేయాలి
– పార్టీ శ్రేణులకు ఎఐసిసి కార్యదర్శి, ఎమ్మెల్యే శ్రీధర్ బాబు పిలుపు
జనంసాక్షి, మంథని : రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు విభేదాలు వీడి సమిష్టిగా కృషి చేయాలని పార్టీ శ్రేణులకు ఎఐసిసి కార్యదర్శి, ఎమ్మెల్యే శ్రీధర్ బాబు సూచించారు. గురువారం పెద్దపల్లి జిల్లా మంథని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. కర్ణాటక తరహాలో 3 వేల ఓట్లకు ఒక క్లస్టర్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. బీఆర్ఎస్ ప్రజావ్యతిరేక విధానాలపై ప్రతీ కార్యకర్త గ్రామాల్లో ప్రచారం చేయాలని సూచించారు. ప్రతి ఒక్క కార్యకర్త నాయకుడు ఎలాంటి విభేదాలు లేకుండా కలిసికట్టుగా పనిచేయాలని, పార్టీలో ప్రతి కార్యకర్త నాయకుడు క్రమశిక్షణతో పనిచేయాలని పేర్కొన్నారు. కష్టపడి పనిచేసిన ప్రతి కార్యకర్తకు తగిన గుర్తింపు ఫలితం ఉంటదని అన్నారు. పార్టీలో కుల, మత విభేదాలు లేకుండా అందరూ కలిసికట్టుగా కలిసికట్టుగా పనిచేసే పార్టీని ముందుకు తీసుకువెళ్లాలని కోరారు.
యూత్ కాంగ్రెస్.. కాంగ్రెస్ పార్టీ కి వెన్నెముక లాగా పనిచేయాలని పిలుపు నిచ్చారు. నాకు ఎలాంటి కులాలు లేవని ,ప్రజలు కార్యకర్తలే నా కులం అని శ్రీధర్ బాబు అన్నారు. ఈ కార్యక్రమంలో జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షులు ఐత ప్రకాష్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు తొట్ట తిరుపతి యాదవ్, మండల కాంగ్రెస్ అధ్యక్షులు సెగ్గెం రాజేష్, పీసీసీ ఎన్నికల కమిటీ సమన్వయకర్త శశి భూషణ్ కాచే, టౌన్ అధ్యక్షులు పోలు శివ, సింగల్ విండో డైరెక్టర్ రవి కంటి సతీష్, నాయకులు ఇనుముల సతీష్, మంథని డివిజన్ ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు మంథని సత్యం, గోటుకారి కిషన్ జి, మంథని మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు ఎరుకల ప్రవీణ్, పేరవేన లింగయ్య యాదవ్, మాజీ ఎంపిటిసి సభ్యులు కుడుదుల వెంకన్న, మహిళా కాంగ్రెస్ నాయకులు నామని సుగుణ , మాదాసి పద్మ, మాజీ సర్పంచ్ జనగామ నర్సింగరావు, అన్ని గ్రామాల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు అన్ని విభాగాల నాయకులు పాల్గొన్నారు.