కర్నాటకలో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారు

                                                       యెడ్యూరప్ప రాజీనామా ప్రజా విజయం:    చంద్రబాబు
అమరావతి,మే19( జ‌నం సాక్షి):  కర్ణాటకలో ప్రజాస్వామ్యాన్ని బిజెపి అపహాస్యం చేసి భంగపడిందని ఎపి సిఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. తాజా రాజకీయ పరిణామాలపై ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించారు. అసెంబ్లీలో బలపరీక్షకు ముందే సాధారణ మెజార్టీలేని యడ్యూరప్ప ప్రభుత్వం కూలిపోవడం ప్రజాస్వామిక విజయంగా అభివర్ణించారు. ప్రధాని నరేంద్ర మోదీ, భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారని మండిపడ్డారు. తాము ఇచ్చిన పిలుపునకు కర్ణాటకలో తెలుగువారు స్పందించారని, తద్వారా భాజపాకు వ్యతిరేకంగా ఓటు వేశారని అన్నారు. కాంగ్రెస్‌, జేడీఎస్‌ ప్రభుత్వం ఏర్పాటుకు గవర్నర్‌కు విజ్ఞప్తి చేశాయని, గవర్నర్‌ మాత్రం యడ్యూరప్పకు అవకాశం ఇచ్చారని సీఎం అన్నారు. భాజపాకు ఒక్కో రాష్ట్రంలో ఒక్కో సంప్రదాయం ఉంటుందని, గోవాలో ఒక సంప్రదాయం, మేఘాలయాలో ఇంకో సంప్రదాయం అనుసరించిందన్నారు. వాళ్లకు అధికారం ఉందని ఇష్టానుసారంగా చేసుకుంటూ వచ్చారని చంద్రబాబు ఆక్షేపించారు.తన పుట్టిన రోజున ధర్మపోరాట దీక్ష చేసే స్థితికి భాజపా తీసుకొచ్చిందన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక ¬దా ఇస్తామని తిరుపతిలో వెంకన్న సాక్షిగా హావిూలు ఇచ్చారని చంద్రబాబు మరోసారి గుర్తు చేశారు. ఆంధ్రప్రదేశ్‌కు అన్యాయం చేసినవారు ఎక్కడున్నా తెలుగువారు మట్టికరిపించాలని పిలుపునిచ్చారు.