కలిసి కదిలితే జయం మనదే

5
ఇండో-చైనా బిజినెస్‌ ఫోరం సదస్సులో మోదీ

బీజింగ్‌,మే16(జనంసాక్షి):   ఈ శతాబ్దం ఆసియాదేనని బలంగా నమ్ముతున్నామని భారత ప్రధాని నరేంద్రమోదీ అన్నారు.   కలిసి కదిలితే జయం మనదేననాన్నరు. ఆసియాలో రాజకీయ స్థిరత్వం, ఆర్థిక అభివృద్ధికి భారత్‌, చైనా భాగస్వామ్యం అవసరమన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ చైనా పర్యటనలో బిజీబిజీగా ఉన్నారు. తన చైనా పర్యటనలో భాగంగా ఇవాళ ఆయన షాంఘైలో పర్యటించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఇండో-చైనా బిజినెస్‌ ఫోరమ్‌ సదస్సులో ఆయన చైనాలోని టాప్‌ 20 కంపెనీలకు చెందిన సీఈవోలను ఉద్దేశించి ప్రసంగించారు. చైనా పర్యటనలో భాగంగా మూడో రోజు  షాంఘైలో 22 మంది సీఈవోలతో ప్రధాని మోదీ సమవేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… భారత్‌లో వస్తువుల ఉత్పత్తి కోసం మేక్‌ ఇన్‌ ఇండియా కార్యక్రమం చేపట్టామన్నారు. యువతకు ఉపాధి లక్ష్యంగా తయారీ రంగాన్ని ప్రోత్సహిస్తున్నట్లు చెప్పారు. . రైల్వేలను ఆధునీకరిస్తామని, 50 నగరాల్లో మెట్రో రైలుకు ప్రణాళికలున్నాయని మోదీ తెలిపారు. పారిశ్రామిక కారిడార్లు, ఆకర్షణీయ నగరాలు అభివృద్ధి చేస్తున్నట్లు

చెప్పారు. చైనాకు భారత సంస్కృతిని పరిచయం చేసిన విద్వాంసులకు ధన్యవాదాలు తెలిపారు. సీఈవోలతో చర్చలు ఫలప్రదంగా ముగిసాయని ప్రధాని వెల్లడించారు.  పరస్పరం సహకరించుకుంటూ కలిసి కట్టుగా పనిచేస్తే చైనా, భారత్‌ రెండు దేశాలు ఆర్థికాభివృద్ధిని సాదిస్తాయని అన్నారు. భారత్‌లో పెట్టుబడులకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని తెలిపారు. రెండు దేశాలు కలిసి పనిచేస్తే ప్రపంచానికి ఎంతో మేలు చేయవచ్చన్నారు. ఈ సందర్భంగా 22 బిలియన్‌ డాలర్ల విలువచేసే 21 వ్యాపార ఒప్పందాలపై ఇరు దేశాల ప్రతినిధులు సంతకాలు చేశారు.  యువతకు ఉపాధి లక్ష్యంగా తయారీ రంగాన్ని ప్రోత్సహిస్తున్నట్లు చెప్పారు. ఆసియాలో రాజకీయ స్థిరత్వం, ఆర్థిక అభివృద్ధికి భారత్‌-చైనా భాగస్వామ్యం అవసరమని మోదీ అన్నారు.

పారిశ్రామిక కారిడార్లు, ఆకర్షణీయ నగరాలు అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు. సీఈవోలతో చర్చలు ఫలప్రదంగా జరిగాయని తెలిపారు. భారత్‌ – చైనా మధ్య చారిత్రక సంబంధాలు ఉన్నాయని…భగవద్గీత, రామాయణం, మహాభారతం లాంటి భారతీయ పురాణాలకు చైనాలో ఎంతో ప్రాచుర్యం ఉందన్నారు. పేదరికాన్ని ఎదుర్కునే శక్తి భారత్‌, చైనాలకు ఉందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఇకపోతే షాంఘై పట్టణంలో ఉన్న పుడాన్‌ వర్సిటీని ఇవాళ ఆయన సందర్శించారు. వర్సిటీలో విద్యార్థులను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. రెండు యూనివర్సిటీల విద్యార్థులను కలవడం తనకెంతో సంతోషంగా ఉందని తెలిపారు. విదేశాల్లో యూనివర్సిటీలను సందర్శించే అవకాశం కొందరు నేతలకు మాత్రమే దక్కుతుందని పేర్కొన్నారు. భారత్‌-చైనా సత్సంబంధాలతో తరతరాలకు లబ్ది చేకూరుతుందని అన్నారు. మహాత్మా గాంధీ విశ్వ మానవుడని, యుగ పురుషుడని కొనియాడారు. మహాత్ముని సిద్దాంతాలు విశ్వ మానవాళికి ఆదర్శం కావాలన్నారు.