ఇండియా- సౌత్ ఏషియాలో నాలుగోసారి 

శంషాబాద్ (జనంసాక్షి) : జీఎంఆర్ శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లిమిటెడ్ (జీహెచ్ఐఏఎల్) ప్రతిష్ఠాత్మక స్కైట్రాక్స్ సర్వేలో మరోసారి అత్యున్నత గౌరవాన్ని సాధించింది. ఇండియా & సౌత్ ఏషియా విభాగంలో ‘బెస్ట్ ఎయిర్‌పోర్ట్ స్టాఫ్ 2025 అవార్డును గేల్ నాలుగవ సారిగా అందుకుంది. స్పెయిన్‌లోని మాడ్రిడ్‌లో జరిగిన ప్యాసింజర్ టెర్మినల్ ఎక్స్‌పో 2025లో ఈ గుర్తింపు  ప్రకటించబడింది.  ఈ అవార్డు ప్రతి కస్టమర్ టచ్‌పాయింట్‌ వద్ద స్టాఫ్  వ్యవహారం, స్నేహపూర్వకత, సమర్థతను జాగ్రత్తగా పరిశీలించే స్కైట్రాక్స్ ఆడిట్ల ఆధారంగా ప్రకటించబడింది.