2035 నాటికి సొంత స్పేస్‌స్టేషన్‌

2040 నాటికి చంద్రుడిపైకి భారత వ్యోమగామి..
` కేంద్ర సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ మంత్రి డా. జితేంద్ర సింగ్‌ ఆశాభావం
న్యూఢల్లీి(జనంసాక్షి):చంద్రయాన్‌ శ్రేణి ప్రయోగాలతో ప్రపంచానికి తన సత్తాను చూపిన భారత్‌.. జాబిల్లిపై సొంత వ్యోమగామిని దించేందుకు ప్రణాళికలు రచిస్తోంది.2040 నాటికి చంద్రుడిపై భారత వ్యోమగామి కాలుమోపుతాడని కేంద్ర సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ మంత్రి డా. జితేంద్ర సింగ్‌ ఆశాభావం వ్యక్తం చేశారు. ఓ ఆంగ్ల ఛానల్‌ ఏర్పాటు చేసిన ‘రైజింగ్‌ భారత్‌ సమ్మిట్‌ 2025’లో ఆయన పాల్గొన్నారు. భారత అంతరిక్ష భవిష్యత్‌ ప్రణాళికలపై మాట్లాడారు. భారత్‌ తన సొంత అంతరిక్ష కేంద్రం ‘భారత్‌ స్పేస్‌ స్టేషన్‌’ను 2035 నాటికి సమకూర్చుకుంటుందని ఆయన వెల్లడిరచారు. ఇక చంద్రయాన్‌-3 మిషన్‌లో భాగంగా ప్రజ్ఞాన్‌ రోవర్‌ చంద్రుడి దక్షిణ ధ్రువంపై విజయవంతంగా దిగిన విషయం తెలిసిందే. భారత వైజ్ఞానిక సత్తాను ఇది ప్రపంచానికి చాటింది. దీంతో చంద్రుడిపై సాఫ్ట్‌ ల్యాండిరగ్‌ చేసిన నాలుగో దేశంగా భారత్‌ అవతరించింది. చంద్రుని దక్షిణ ధ్రువానికి చేరుకున్న తొలి దేశంగా రికార్డు సృష్టించింది. ఇప్పుడు చంద్రయాన్‌-4పై దృష్టిసారించింది. చంద్రుడి ఉపరితల నమూనాలను భూమికి తీసుకొచ్చేందుకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ప్రతిష్ఠాత్మక చంద్రయాన్‌-4 ప్రయోగాన్ని 2027లో చేపట్టనున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా ఎల్‌వీఎం-3 రాకెట్‌ను కనీసం రెండుసార్లు ప్రయోగించి.. చంద్రయాన్‌-4 మిషన్‌కు సంబంధించిన ఐదు భిన్న భాగాలను నింగిలోకి పంపిస్తారు. వాటిని కక్ష్యలోనే బిగిస్తారు. చంద్రుడిపైకి భారత వ్యోమగామిని పంపించేంతవరకు చంద్రయాన్‌ శ్రేణి ప్రయోగాలు కొనసాగుతూనే ఉంటాయని ఇస్రో ఇప్పటికే వెల్లడిరచింది. ఇక భారత తొలి మానవసహిత అంతరిక్ష యాత్ర గగన్‌యాన్‌ను వచ్చే ఏడాది చేపట్టనున్నారు.