వరుసగా రెండోసారి రెపోరేటు తగ్గింపు

` 0.25 శాతం మేర సవరించిన ఆర్‌బిఐ
` తగ్గనున్న గృహ, వాహన రుణాల వడ్డీల భారం
` ద్రవ్యపరపతి కమిటీ నిర్ణయాలు ప్రకటించిన గవర్నర్‌ మల్హోత్రా
` బంగారం రుణాలపై ఆంక్షలు విధించే యోచనలో ఆర్‌బిఐ
ముంబై(జనంసాక్షి):విశ్లేషకుల అంచనాలను నిజం చేస్తూ కీలక వడ్డీ రేట్లను ఆర్‌బీఐ మళ్లీ సవరించింది. వరుసగా రెండోసారి రెపో రేటును 0.25 శాతం మేర తగ్గించింది. ఈ మేరకు ద్రవ్య పరపతి విధాన కమిటీ నిర్ణయాలను ఆర్‌బీఐ గవర్నర్‌ సంజయ్‌ మల్హోత్రా బుధవారం వెల్లడిరచారు. దీంతో రెపో రేటు 6.25 శాతం నుంచి 6 శాతానికి దిగొచ్చింది. ఈ ఏడాది ఫిబ్రవరిలోనూ కీలక వడ్డీరేట్లను కేంద్ర బ్యాంకు 25 బేసిస్‌ పాయింట్లు- తగ్గించిన సంగతి తెలిసిందే. ద్రవ్య పరపతి విధాన సవిూక్ష నిర్ణయాలను ఆర్బీఐ గవర్నర్‌ సంజయ్‌ మల్హోత్రా వెల్లడిరచారు. రెపో రేటుపై 25 బేసిస్‌ పాయింట్లు- తగ్గించినట్లు- ఆయన వెల్లడిరచారు. దీంతో గృహరుణాలపై వడ్డీ రేట్లు తగ్గే అవకాశాలు ఉన్నాయి. రెపోరేటును 6.25 శాతం నుంచి 6 శాతానికి తగ్గించినట్లు ఆర్బీఐ గవర్నర్‌ తెలిపారు. రెపో రేటు- తగ్గించడం వల్ల .. బ్యాంకులపై రుణభారం తగ్గనున్నది. దీని వల్ల బ్యాంకులు కూడా కస్టమర్లకు తక్కువ రేటుకే వడ్డీ ఇచ్చే అవకాశాలు ఉంటాయి. ఫలితంగా రుణాలపై ఈఎంఐలు తగ్గే ఛాన్సు ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. రెపో రేటను 6 శాతానికి తగ్గించాలని ద్రవ్య పరపతి విధాన కమిటీ ఏకగ్రీవంగా నిర్ణయించినట్లు- ఆర్బీఐ గవర్నర్‌ మల్హోత్రా తెలిపారు. తగ్గింపు నిర్ణయానికి మానిటరీ పాలసీ కమిటీ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపినట్లు ఆర్‌బీఐ గవర్నర్‌ వెల్లడిరచారు. ఈ సందర్భంగా స్థిర విధానం నుంచి సర్దుబాటు వైఖరికి మరాలని కమిటీ నిర్ణయించినట్లు తెలిపారు. వడ్డీరేటు తగ్గింపుతో గృహ, వాహన, ఇతర రుణాల వడ్డీరేట్లు తగ్గే అవకాశం ఉంది. ప్రస్తుతం నెలకొన్న ఆర్థిక అనిశ్చితులు పెట్టుబడులు, వినిమయంపై ప్రతికూల ప్రభావం చూపించ నున్నాయి. ఫలితంగా వృద్ధి రేటు నెమ్మదించొచ్చని కూడా గవర్నర్‌ అభిప్రాయపడ్డారు. అధిక సుంకాలతో ఎగుమతులపై తీవ్ర ప్రభావం పడనుంది. తయారీ రంగం పునరుద్ధరిస్తున్న సంకేతాలు కన్పిస్తున్నాయి. 2025-26 ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు- 6.5శాతంగా నమోదయ్యే అవకాశాలున్నాయి. తొలి తైమ్రాసికంలో 6.5శాతం, రెండో తైమ్రాసికంలో 6.7శాతం జీడీపీ నమోదవ్వొచ్చని అంచనా. మూడు, నాలుగు తైమ్రాసికాల్లో వృద్ధిరేటు వరుసగా 6.6శాతం, 6.3శాతం ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. ఆహార పదార్థాల ధరలు తగ్గుముఖం పడుతుండటంతో 2025-26 ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యోల్బణం 4శాతానికి దిగి రావొచ్చని అంచనా. తైమ్రాసికాల వారీగా 3.6శాతం, 3.9శాతం, 3.8శాతం, 4.4శాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. ఏప్రిల్‌ 4వ తేదీ నాటికి విదేశీ నిల్వలు 676 బిలియన్‌ డాలర్లుగా ఉన్నాయి. వీటితో రాబోయే 11 నెలల వరకు దిగుమతులకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని అన్నారు. ఇకపోతే బంగారం తాకట్టు పెట్టి తీసుకునే రుణాలకు సంబంధించి నిబంధనలు కఠినతరం కానున్నాయి. దీనికి సంబంధించి మార్గదర్శకాలు జారీ చేస్తామని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ప్రకటించింది. దీంతో ముత్తూట్‌ ఫైనాన్స్‌, ఐఐఎఫ్‌ఎల్‌ ఫైనాన్స్‌ వంటి రుణ జారీ సంస్థల షేర్లు భారీగా క్షీణించాయి. బంగారు ఆభరణాలు తాకట్టు పెట్టి రుణాలు తీసుకోవడం ఇటీవల విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో వీటిని అడ్డుకొనేందుకు ఆర్‌బీఐ చర్యలకు సిద్ధమవుతోందని కొన్నిరోజుల క్రితమే వార్తలు వచ్చాయి. దీనిపై ఆర్‌బీఐ తాజాగా స్పందించింది. వివిధ రకాల నియంత్రణ సంస్థలు అనుసరిస్తున్న మార్గదర్శకాలను సమన్వయం చేయడంతో పాటు, సాధ్యమైనంత వరకు రిస్క్‌ తగ్గించేందుకు త్వరలో సమగ్ర నిబంధనలతో మార్గదర్శకాలు జారీ చేస్తామని పేర్కొంది. ఎంపీసీ సమావేశ వివరాల వెల్లడి సందర్భంగా ఆర్‌బీఐ గవర్నర్‌ సంజయ్‌ మల్హోత్రా ఈ వ్యాఖ్యలు చేశారు. ఆర్‌బీఐ ప్రకటనతో ముత్తూట్‌ ఫైనాన్స్‌ షేర్లు ఇంట్రాడేలో 10 శాతం మేర పతనం అయ్యాయి. బీఎస్‌ఈలో ఆ కంపెనీ షేర్లు రూ.2063కు చేరాయి. ఐఐఎఫ్‌ఎల్‌ షేర్లు సైతం 8 శాతం మేర క్షీణించాయి. మణప్పురం షేర్లు 3 శాతం, చోళమండలం షేర్లు 4.7 శాతం మేర పడ్డాయి. ముత్తూట్‌ ఫైనాన్స్‌ జారీ చేసే రుణాల్లో 98 శాతం వరకు బంగారం తాకట్టుగా పెట్టుకుని ఇచ్చేవే అధికం కావడంతో ఆ కంపెనీ షేర్లు ఎక్కువగా ప్రభావితం అయ్యాయి. మణప్పురం 50 శాతం, ఐఐఎఫ్‌ఎల్‌ 21 శాతం చొప్పున మొత్తం రుణాల్లో వాటాను కలిగిఉన్నాయి. రుణాల జారీ విషయంలో ఆర్థిక సంస్థలేవీ ఒకేతరహా విధానాలు పాటించడం లేదని ఆర్‌బీఐ గుర్తించింది. బంగారం తాకట్టు రుణాల జారీ నుంచి ఆ నగదు వినియోగం, వేలం వరకు ఇలా ప్రతి దానికీ విధివిధానాలను ఖరారు చేసే అవకాశం ఉంది.

ద్రవ్యోల్బణం కాదు.. టారిఫ్‌లపైనే టెన్షన్‌
` ఆర్‌బీఐ గవర్నర్‌ సంజయ్‌ మల్హోత్రా
ముంబయి(జనంసాక్షి): అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ టారిఫ్‌ల ప్రకటనతో ప్రపంచ వాణిజ్యంపై నీలినీడలు కమ్ముకున్నాయి. చైనా వంటి దేశాలు ప్రతిగా సుంకాలు వేస్తూ అమెరికాకు చిర్రెత్తిస్తుంటే.. కొన్ని దేశాలు మాత్రం సుంకాల విషయంలో అగ్రరాజ్యంతో చర్చలకు సిద్ధమవుతున్నాయి. ఈ టారిఫ్‌లపై దేశీయంగానూ ఆందోళన వ్యక్తమవుతోంది. ఇన్నాళ్లు ద్రవ్యోల్బణం ఒత్తిడితో మానిటరీ పాలసీ విషయంలో కఠిన వైఖరిని అవలంబిస్తూ వచ్చిన ఆర్‌బీఐ.. ఇప్పుడు ద్రవ్యోల్బణం కంటే అమెరికా టారిఫ్‌లపై ఆందోళన వ్యక్తంచేస్తోంది. ఈ క్రమంలోనే 2025-26 ఆర్థిక సంవత్సరానికి తన వృద్ధి అంచనాలను 20 బేసిస్‌ పాయింట్లను తగ్గించి 6.5 శాతానికి పరిమితం చేసింది. దేశ ఆర్థిక వృద్ధిపై సుంకాల ప్రభావంపై ఆందోళన చెందుతున్నట్లు ఆర్‌బీఐ గవర్నర్‌ సంజయ్‌ మల్హోత్రా పేర్కొన్నారు. ఎంపీసీ నిర్ణయాల వెల్లడి సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి వృద్ధి అంచనాలను 20 బేసిస్‌ పాయింట్లు తగ్గించామన్నారు. భౌగోళికంగా నెలకొన్న అనిశ్చిత పరిస్థితుల కారణంగా ఈ పరిస్థితి ఏర్పడిరదన్నారు. ప్రస్తుత వాణిజ్య యుద్ధ భయాలు, ముఖ్యంగా అమెరికా నుంచి సుంకాల పెంపు కారణంగా ఈ పరిస్థితి నెలకొందన్నారు. దేశీయంగా ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టినప్పటికీ.. బాహ్య కారకాల మన దేశ ఎగుమతులు, ఆర్థిక కార్యకలాపాలపై ప్రభావం చూపే అవకాశం ఉందని పేర్కొన్నారు. వృద్ధిని, ద్రవ్యోల్బణాన్ని సమర్థంగా నిర్వహించడానికి ప్రభుత్వంతో కలిసి పనిచేయనున్నట్లు మల్హోత్రా చెప్పారు. ద్రవ్యోల్బణం లక్షిత స్థాయిలోనే ఉందన్నారు. ప్రపంచ వాణిజ్యం మరిన్ని అవాంతరాలు ఎదుర్కొంటే ఆ మేర మన దేశ వృద్ధిపై ప్రభావం పడుతుందన్నారు. డాలరుతో రూపాయి విలువ క్షీణత గురించి కూడా మల్హోత్రా మాట్లాడారు. ప్రస్తుత వాణిజ్య యుద్ధ భయాలు, ఇతర దేశాల కరెన్సీతో పోలిస్తే మన రూపాయి విలువ స్థిరంగా ఉందన్నారు. రూపాయిపై మరింత ఒత్తిడి పెరిగితే తట్టుకుని నిలబడేందుకు ఆర్‌బీఐ దగ్గర తగిన విదేశీ మారకం నిల్వలు ఉన్నాయని మల్హోత్రా పేర్కొన్నారు.

దేశీయంగా సంస్కరణలకు ఇదే సమయం
ట్రంప్‌-చైనా సుంకాల నేపత్యంలోజాగ్రత్తగా ఉండాలి
పెట్టుబడులు ఆకర్శంచేలా వ్యవహరించాలి
మాజీ ఆర్‌బిఐ గవర్నర్‌ రఘురామ రాజన్‌
న్యూఢల్లీి(జనంసాక్షి): ప్రస్తుతం అమెరికా-చైనా మధ్య తీవ్రస్థాయిలో జరుగుతున్న వాణిజ్యయుద్ధం భారత్‌కు మంచి అవకాశాలు సృష్టిస్తుందని ప్రముఖ ఆర్థికవేత్త, ఆర్బీఐ మాజీ గవర్నర్‌ రఘురామ్‌ రాజన్‌ అన్నారు. అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలు తలపడినప్పుడు వాణిజ్యంలో కొంత అస్థిరత ఉంటుందని చెప్పారు. ఈ సమయంలో భారత్‌ సరైన నిర్ణయాలు తీసుకొంటే లబ్ధి పొందుతుందన్నారు. అయితే ట్రంప్‌ నిర్ణయాలతో అమెరికా సెల్ఫ్‌గోల్‌ చేసుకొందని రఘురామ్‌ రాజన్‌ అభిప్రాయపడ్డారు. భారత్‌ చురుగ్గా వ్యవహరించి పెట్టుబడులు పెరిగేలా.. ఎగుమతులకు ప్రోత్సాహం లభించేలా అమెరికాతో వాణిజ్య చర్చలు జరపాలని అన్నారు. భారత్‌ ఇప్పుడు ఒక్క అమెరికాపైనే కాకుండా .. టారిఫ్‌ల విధానాన్నే పూర్తిగా సరళీకరించాల్సిన సమయం ఆసన్నమైందని చెప్పారు. భారత్‌ ఇప్పుడు ఆర్థిక రక్షణాత్మక వైఖరి నుంచి దూరంగా జరిగి.. వాణిజ్య, పెట్టుబడుల వాతావరణాన్ని సంస్కరించాల్సిన అవసరం ఉందని రాజన్‌ అభిప్రాయపడ్డారు. ఈ పరిస్థితులను అవకాశాలుగా భావించి భారత్‌ నిర్ణయం తీసుకోవాలన్నారు. పెట్టుబడులను ఆకర్షించేలా దేశీయంగా సంస్కరణలను చేపట్టాలని చెప్పారు. తూర్పు, ఉత్తర దేశాలతోపాటు- ఆర్సీఈపీ, ఆసియాన్‌ వంటి గ్రూపులు, చైనా, జపాన్‌ వంటి దేశాలతో వాణిజ్య సంబంధాలు బలోపేతం చేసుకోవాలన్నారు. బీజింగ్‌తో న్యూదిల్లీ వాణిజ్య లోటు- ఉన్నా.. బ్యాలెన్స్‌గా వ్యవహరించి నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు. ట్రంప్‌ నిర్ణయాలు స్వల్పకాలానికి అమెరికాకు సెల్ఫ్‌గోల్‌లా పనిచేస్తాయని రాజన్‌ హెచ్చరించారు. ఆ దేశంలో నిరుద్యోగిత, ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టి.. ఫెడ్‌ వడ్డీరేట్లు- తగ్గించేందుకు సౌకర్యవంతంగా ఉన్న సమయంలో.. సొంత ఆర్థికవ్యవస్థనే ఆయన పట్టాలు తప్పిస్తున్నారన్నారు. అమెరికాకు ఎగుమతులు చేయడంపై ఆధారపడిన వియత్నాం వంటి దేశాలు ఈ నిర్ణయాలతో తీవ్రంగా ఇబ్బంది పడుతున్నాయని చెప్పారు. వీటితో పోలిస్తే భారత్‌పై టారిఫ్‌ల ప్రభావం పరిమితిగా ఉంటుందని చెప్పారు. మన జీడీపీతో పోలిస్తే ఎగుమతులు తక్కువగా ఉండటమే ఇందుకు కారణమని రాజన్‌ అభిప్రాయపడ్డారు. మన వృద్ధిరేటు పైనా పెద్దగా ప్రతికూల ప్రభావం ఉండదన్నారు. ట్రంప్‌ టారిఫ్‌ల దెబ్బను తప్పించుకోవడానికి చైనా నుంచి వెళ్లిపోవాలని నిర్ణయించుకొన్న కంపెనీలకు భారత్‌ ఓ ఆకర్షణీయమైన ప్రదేశమని రాజన్‌ వెల్లడిరచారు. మనం సరైన నిర్ణయాలు తీసుకొంటే.. అమెరికా తక్కువ టారిఫ్‌లు విధించిన దేశాల్లో భారత్‌ ఉండటం, దేశీయంగా ఉన్న బలమైన మార్కెట్‌ వంటి భారీగా పెట్టు-బడులను తీసుకొచ్చే అవకాశం ఉంది. ఈ క్రమంలో ప్రభుత్వం పెట్టుబడులను ఆకర్షించే నిర్ణయాలు తీసుకోవడంతోపాటు-.. పన్ను చట్టాలను మరింత సరళీకరించాలి.భారత్‌కు సేవారంగ ఎగుమతులకు మాత్రం టారిఫ్‌ల సెగ తాకలేదని చెప్పాలని రాజన్‌ వివరించారు. ఇటీ-వల కాలంలో దేశంలో సేవారంగ ఎగుమతులు తయారీ రంగాన్ని దాటేశాయన్నారు. ఇక అమెరికా టారిఫ్‌లు భారత్‌లో ద్రవ్యోల్బణ నియంత్రణకు కూడా ఉపయోగపడే అవకాశాలున్నాయని చెప్పారు. భారత ఎగుమతులు తూర్పు ఆసియా వంటి మార్కెట్ల వైపు చూస్తాయని.. అదే సమయంలో దేశీయ మార్కెట్లు- కూడా వాటిని ఆకర్షిస్తాయని చెప్పారు. ఇక చైనా ఉత్పత్తులకు అమెరికాలో ప్రవేశం కష్టం కావడంతో.. భారత్‌ వైపు మళ్లే అవకాశం ఉన్నట్లు- వెల్లడిరచారు. ఇక టారిఫ్‌లు ఇలానే కొనసాగితే మాత్రం ప్రపంచంలో ఆర్థిక మాంద్యం ఏర్పడే ప్రమాదం ఉందని రాజన్‌ అంచనా వేశారు.