భారతదేశంలో జైనానిది విడదీయలేని బంధం

` ఉగ్రవాదం లాంటి సవాళ్లకు జైనమత విలువలే సమాధానం
` మహావీర్‌ జయంత్యుత్సవంలో ప్రధాని మోడీ
న్యూఢల్లీి(జనంసాక్షి):భారత దేశానికి గుర్తింపు తీసుకురావడంలో.. జైన మతం వెలకట్టలేని పాత్రను పోషించిందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ప్రపంచానికి సవాళ్లుగా మారిన ఉగ్రవాదం, యుద్ధం,పర్యావరణ పరిరక్షణ లాంటి సమస్యలకు.. జైన మత విలువలు సమాధానం ఇవ్వగలవన్నారు. నవకర మహామంత్ర దివస్‌ సందర్భంగా ఢల్లీిలో జరిగిన కార్యక్రమంలో పాల్గొని ఆయన మాట్లాడారు. ప్రాచీన మతానికి చెందిన సంప్రదాయాన్ని, వారసత్వాన్ని, ప్రబోధనలను రక్షించేందుకు కేంద్ర ప్రభుత్వం కట్టు-బడి ఉందని మోదీ తెలిపారు. పార్లమెంట్‌ బిల్డింగ్‌ లో జైన తీర్థంకరుల విగ్రహాలు ఉన్నట్లు- చెప్పారు. జైన మతంలో ఉన్న అనేకాంతవాదం గురించి ఆయన ప్రస్తావించారు. నిజం అనేది అనేక రూపాల్లో వ్యక్తం అవుతుందన్నారు. జైన మతంలో ఒకరిపై ఒకరు ఆధారపడుతారన్న వాస్తవాన్ని గుర్తింపు ఉందని, అందుకే వాళ్లు స్వల్ప స్థాయిలో కూడా హింసను ఆమోదించరన్నారు. శాంతి, సామర్యం, పర్యావరణ పరిరక్షణలో ఇదే కీలకం అన్నారు. భారతీయ ఆధ్యాత్మిక వైభవానికి జైన సాహిత్యం వెన్నుముకగా నిలుస్తుందన్నారు.

మేలో రష్యాకు మోదీ..
` విక్టరీడే పరేడ్‌లో పాల్గొననున్న ప్రధాని
మాస్కో(జనంసాక్షి): రష్యా ప్రభుత్వం భారత ప్రధాని నరేంద్ర మోదీని మాస్కోలో మే 9న జరగబోయే విజయ దినోత్సవ (విక్టరీ డే) పరేడ్‌కు ఆహ్వానించింది .రెండవ ప్రపంచ యుద్ధంలో నాజీ జర్మనీపై సోవియట్‌ యూనియన్‌ సాధించిన విజయానికి గుర్తుగా ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది 80వ విజయదినోత్సవ వార్షికోత్సవం జరగనుంది.ప్రధాని మోదీని తమ దేశానికి ఆహ్వానిస్తున్నట్లు రష్యా ఉప విదేశాంగ మంత్రి ఆండ్రీ రుడెంకో తెలిపారు. రష్యా రాజధాని మాస్కోలోని రెడ్‌ స్క్వేర్‌లో జరిగే ఈ వేడుకలో భారత ప్రధాని పాల్గొనే అవకాశం ఉందని, దీనికి సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయని రుడెంకో తెలిపారు. 2024 జూలైలో ప్రధాని మోదీ రష్యాలో పర్యటించారు. ఇప్పుడు ఐదేళ్ల తరువాత మరోమారు మోదీ రష్యాకు వెళ్లనున్నారు. ఈ ఆహ్వానం భారత్‌-రష్యా లమధ్య దీర్ఘకాల స్నేహ సంబంధాలను మరింత బలోపేతం చేసే అవకాశంగా చూడవచ్చని విశ్లేషకులు అంటున్నారు. అయితే ప్రధాని మోదీ రష్యా పర్యటన గురించి భారత ప్రభుత్వం నుండి ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు.రష్యాలో నిర్వహించే విజయ దినోత్సవం ఆ దేశంలో జరిగే అత్యంత ప్రతిష్టాత్మకమైన జాతీయ వేడుకలలో ఒకటి. ఈ సందర్భంగా సైనిక పరేడ్‌, యుద్ధ వీరులకు సన్మానం, చారిత్రక ఘటనలను స్మరించుకునే వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తారు. ఈ వేడుకలకు అంతర్జాతీయ నేతలను ఆహ్వానించడాన్ని రష్యా తన సంప్రదాయంగా కొనసాగిస్తోంది. 2005లో భారత మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ రష్యా విజయ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు.